అమరావతి:“అసత్యాలను పుస్తకరూపంలో ముద్రించి మరీ జగన్ రెడ్డి, గవర్నర్ తో చదివించే ప్రయత్నం చేయడం రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే. 99 శాతం హామీలు నెరవేర్చామని చెప్పుకుంటున్న జగన్ రెడ్డి, మద్యనిషేధంపై ఏం చెబుతారు? ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్లలో దశలవారీగా మద్యాన్ని నిషేధిస్తా నని చెప్పిన జగన్మోహన్ రెడ్డి, 25 ఏళ్లలో మద్యం అమ్మకాలపై రాబోయే ఆదాయాన్ని తాకట్టుపెట్టి రూ.25వేలకోట్ల అప్పులు తెచ్చాడు. విషం కంటే దారుణమైన జేబ్రాండ్ మద్యం అమ్మిస్తూ ఎన్నో కుటుంబాలకు పెద్దదిక్కు లేకుండా చేశాడు. నాడు-నేడు, అమ్మఒడి పేరుతో గవర్నర్ తో చెప్పించినవన్నీ అబద్ధాలే. జీవో నెం-117 తీసుకొచ్చి, పాఠశాలల్ని విలీనం చేసి, నాడు-నేడు కింద అభివృద్ధి చేసినట్టు చెప్పుకుంటున్న పాఠశాలల్ని కూడా నిరుపయోగంగా మార్చారని టీడీపీ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ అన్నారు. ఎంతమంది విద్యార్థులు ప్రాథమికవిద్యకు దూరమయ్యారో ముఖ్య మంత్రికి తెలియదా? అమ్మఒడి పథకంలో 83 లక్షల మంది విద్యార్థులు ఎక్కడి నుంచి వచ్చారో చెప్పండి. చంద్రబాబు 87శాతం పూర్తిచేసిన పనుల్ని 5ఏళ్లలో జగన్ రెడ్డి పూర్తి చేయలేకపోయాడు. కుప్పం నియోజకవర్గానికి నీళ్లిస్తానని చెప్పి, ఒక్క ఎకరాకు కూడా ఇవ్వలేక భంగపడ్డాడుకుప్పం నియోజకవర్గానికి హంద్రీనీవా ద్వారా నీళ్లు ఇవ్వడానికి చంద్రబాబు హయాంలో 87శాతం పూర్తైన పనుల్ని, తన ఐదేళ్ల పాలనలో జగన్ రెడ్డి ఎందుకు పూర్తిచేయలేదు? రైతులకు మేలు చేశానని చెప్పుకునే ముఖ్యమంత్రి కుప్పం నియోజకవర్గ రైతులకు ఎందుకు ఇవ్వలేకపోయారు? కాలువల నిర్మాణం పేరుతో కమీషన్లు కొట్టేసి, చంద్రబాబు తన నియోజకవర్గానికి వస్తున్నాడని తెలిసి, అప్పటికప్పుడు హడావుడిగా అనంతపురం వెళ్లాల్సిన నీటిని కుప్పానికి తరలించే ప్రయత్నం చేసి విఫలమైంది నిజం కాదా? రైతులు, మహిళలు, విద్యా ర్థులు, యువత, నిరుద్యోగులు ఇలా అన్ని వర్గాలకు అన్యాయం చేసి, ఎన్నాళ్లు అబద్ధాలు చెప్పి మోసగించే ప్రయత్నం చేస్తారు? జగన్ రెడ్డి హాయాంలోఒక్క విశాఖపట్నం నుంచే 18 పరిశ్రమలు తరలిపోయింది నిజం కాదా? రాష్ట్రం నుంచి వెళ్లిపోవడానికి తాను సిద్ధం అని జగన్ రెడ్డే చెబుతు న్నాడునిరుద్యోగులకు ప్రభుత్వపరంగా ఇవ్వాల్సిన ఉద్యోగాలు ఇవ్వకుండా, చివరకు టీడీపీ హయాంలో రాష్ట్రానికి వచ్చిన కంపెనీలు, పరిశ్రమలు కూడా తరలిపోయేట్టు చేశారు. ఎస్.టీ.పీ.ఏ ( సాఫ్ట్ వేర్ టెక్నాలజీ పాక్స్ ఆఫ్ ఇండియా) వారు ఇచ్చిన సమాచారం ప్రకారం ఒక్క విశాఖపట్నం నుంచే 18 కంపెనీలు జగన్ రెడ్డి హయాంలో రాష్ట్రం నుంచి తరలిపోయాయి. టీ.సీ.ఎల్, ఫాక్స్ కాన్, కియా అనుబంధ పరిశ్రమలు, రిలయన్స్ వంటి సంస్థలు ఈప్రభుత్వ తీరుతో విసిగిపోయి రాష్ట్రం నుంచి వెళ్లి పోయింది నిజం కాదా? జీతాలు పెంచుకుండా అంగన్ వాడీ సిబ్బందిని వేధిస్తు న్నారు. సిద్ధం..సిద్ధం అంటూ ముఖ్యమంత్రి ప్రజలసొమ్ముతో భారీ హోర్డింగ్ లు ఏర్పాటు చేశాడు. ఎన్నికల తర్వాత తాను రాష్ట్రం నుంచి వెళ్లిపోవడానికి సిద్ధం అని జగన్ రెడ్డే చెప్పుకుంటున్నాడు.” అని శ్రీకాంత్ ఎద్దేవాచేశారు.