Friday, November 29, 2024

Creating liberating content

తాజా వార్తలుఅయ్యో కళామతల్లి… ఏమిటీ దౌర్భాగ్యం…

అయ్యో కళామతల్లి… ఏమిటీ దౌర్భాగ్యం…

కళకు కూడా కులం వర్ణం ఉంటుందా
ఆ నలుగురు పాడిందే పాట ఆడిందే ఆట నా
ఆ వ్యాఖ్యాత నచ్చితేనే ఆ పాట అద్బుతమా…
పొట్టకూటి కోసం పాటలు పాడితేకుడా పాపమా
వారిలో వారికి నచ్చక పోతే ఏదయినా ముద్ర వేస్తారా
అందుకేనా ఆనాడు రమాసంకరుడు అడ్డుకున్నది
ఆ సీనియర్ చెప్పిందే సంస్థ,అక్కడ పాడితేనే గుర్తింపా…
గుర్తింపు గాత్రానికా గాయనీ గాయకులుకా
వారికి సలామ్ కోడితేనే సన్మానాలు ఉంటాయా…
వారు మెచ్చితే మరో బాలు,గాణకోకిల ..లేదంటే ఇక అంతేనా…
వీరినేనా కళామతల్లిబిడ్డలు అనేది..
ఆహా ఇదేమి విడ్డురమో కదా…
అందుకేనా కౌతాలో కరెంట్ కోతలు…

విజయవాడ: సృష్టికర్త ఓ బ్రహ్మ ఆ బ్రహ్మను సృష్టించింది ఓ అమ్మ…ఆ అమ్మకే తెలియని చిత్రాలు ఎన్నో …అని అమ్మరాజీనామాలో దర్శకరత్న దాసరినారాయణరావు పాట పాడి ప్రేక్షక లోకాన్ని మెప్పించిన తీరు లాగా కొన్ని కళా కళాసంస్థల అధినేతలు కళామతల్లికి కళంకితం చేసే విదంగా కళకు కూడా కులం, వర్ణం అంటగట్టడం ఎంతటి దౌర్భాగ్యమో అర్థం కావడంలేదు.ఓ కళాకారుడు ఓ ప్రదర్శన ఇస్తే జీవిత పరమార్థమే మారిపోతుంది. అలానే ఓ గాయనీ గాయకుడు తన గాణామృతాన్ని వినిపిస్తే రాళ్లు కూడా కరిగి స్వరాలు పలుకుతాయన్నది ఆనాటి చిత్రాల ద్వారా తెలియవస్తుంది. గానం స్వరరాగయుక్తమై తాళం పల్లవి అనుసంధానమైతే ఆ గాయనీ,గాయకులను మరో దేవి, దేవతలు గా ఆరాధిస్తారు అభిమానిస్తారు అదే పాటకు ఉన్న ప్రత్యేకత. స్వరాలకు నరాలు నివ్వుమని జీవ నాడులు కూడా ఉత్ప్రేరకం చెంది అలసి పోయిన గుండె కూడా అద్భుతంగా కొట్టుకుంటి అజేయులుగా తయారవుతరని అనేక ప్రాచీన చిత్రాల ద్వారా ఈ సమాజానికి తెలియపరుస్తున్నారు. అలాంటిది ఆధునిక సమాజంలో కొన్ని కళా సంస్థలు తమను తాము గొప్పగా చూపించుకోవడం కోసం కులం వర్ణం అంటకడుతున్నారని కొంతమంది సీనియర్ గాయనీ గాయకులు ఆవేదన చెందుతున్నారు. వారికి నచ్చిన వ్యాఖ్యాత,వారికి నచ్చిన,మెచ్చిన ఆ నలుగురినే నవీన గాయనీ గాయకులు గా అభివర్ణించుకుంటూ పొట్టకూటి కోసం పాటలు పాడటానికి వస్తే పైసలు ఇస్తే ఇవ్వడం లేదంటే ఇవ్వకపోగా అక్కడ పాడితే ఇక్కడ వద్దు, ఇక్కడ పాడితే అక్కడికి పోవద్దు అని ఆజ్ఞలు వేస్తూ అందరిపై ఆధిపత్యం చేలాయిస్తున్నారని చెప్పలేక చెబుతున్నారు కొంతమంది గాయనీ గాయకులు.గానం బాగుంటే కదా ఆ గానాన్ని వినిపించిన వారికి గుర్తింపు వచ్చేది. గానంతో పనిలేకుండా వారికి సలామ్ అంటే గాణకోకిల బిరుదులు, అభినవ బాలు,గాణగంధర్వులు ఇలా రాయలేని,చెప్పడానికి వీలుకాని బిరుదులను ఇవ్వడం కొందరి వంతు.ఇవన్నీ చూసి, నిశితంగా గమనిస్తున్న కౌతాపూర్ణానంద ధర్మసత్ర,కళా వేదిక నిర్వాహకులు కూడా అడ్డగోలుగా కరెంట్ కట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి వారికేనా అండగా ఉండేదని అలా ప్రవర్తిస్తున్నట్లు కూడా సమాచారం అందుతోంది. గతంలో కూడా కొన్ని సంఘటనలు చూసి సినినిర్మాత,గాయకుడు ఒమ్మి రమాశంకర్ కూడా కొంతమేర అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేసినట్లు అప్పట్లో ఆయన వెళ్లబుచ్చేవారు.మరి ఇలాంటి కళాసంస్థల ఆగడాలకు కళ్లెం వేసే వారెవరో మరి చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article