స్వతంత్ర సంగ్రామంలో బ్రిటిష్ వారిని గజ గజ వణికించిన విప్లవ వీరుడు వి అల్లూరి సీతారామరాజు కు భారత రత్న ఇవ్వాలని అల్లూరి సీతారామరాజు జాతీయ యువజన సంఘం డిమాండ్ చేసింది. సీతారామరాజు తపస్సు చేసిన గోపాలపట్నంలోని సీతమ్మ కొండపై ఉన్న రామలింగేశ్వర ఆలయాన్ని యువజన సంఘం ప్రతినిధులు సందర్శించారు. తుని పట్టణ పర్యటనలో భాగంగా గొల్ల అప్పారావు సెంటర్లో గల సీతారామరాజు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అల్లూరి విద్యను అభ్యసించిన స్థానిక రాజా హై స్కూల్ ను కూడా సందర్శించారు. ఈ సందర్భంగా అల్లూరు యువజన సంఘం జాతీయ అధ్యక్షుడు పడాల వీరభద్రరావు మాట్లాడుతూ స్వతంత్ర సంగ్రామంలో దేశం కోసం ప్రాణాలు అర్పించిన అల్లూరి పోరాటపటమ నేటి సమాజానికి మార్గదర్శకం కావాలన్నారు. అయితే అల్లూరి చరిత్ర పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉదాసీనంగా వ్యవహరిస్తుందని ఆయన ఆరోపించారు. అల్లూరి పేరున 125 రూపాయల నాణాన్ని విడుదల చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షురాలు వాడపల్లి వెంకటరమణమ్మ, కార్యదర్శి శ్యామల వరలక్ష్మి, లక్కాకుల బాబ్జి, శివంగి నాగేశ్వరరావు, పోతిన వెంకటేశ్వరరావు, రాజా హై స్కూల్ ప్రధానోపాధ్యాయుడు శేషగిరి, ఉపాధ్యాయులు కిల్లాడ రమేష్, డి నాగేశ్వరరావు, ఎం స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు