Friday, November 29, 2024

Creating liberating content

తాజా వార్తలుఅవ్వాతాతల ఉసురు పోసుకుంటున్నారు-ఎమ్మెల్యే అభ్యర్థి మక్బూల్

అవ్వాతాతల ఉసురు పోసుకుంటున్నారు-ఎమ్మెల్యే అభ్యర్థి మక్బూల్

కదిరి :ప్రతినెలా సూర్యోదయానికి ముందే వలంటీర్లు ఇంటివద్దకే వెళ్లి అవ్వాతాతలకు పెన్షన్ ఇచ్చేవారని, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేసిన కుట్రవల్ల పండుటాకులు, వికలాంగులు పెన్షన్ కోసం సచివాలయం చుట్టూ తిరుగుతున్నారని, వారు నానా ఇబ్బందులు పడుతూ బాబుకు శాపనార్థాలు పెడుతున్నారని కదిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బి.యస్. మక్బూల్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను నిరుపేదల ఇంటి వద్దకే చేర్చి వారికి అండగా నిలబడిన వాలంటీర్ల వ్యవస్థతో పాటు రాష్ట్రంలోని పండుటాకులపై ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు కక్ష కట్టారన్నారు. టీడీపీ కూటమి నాయకులు వాలంటీర్లపై చేసిన ఫిర్యాదు వల్ల నేడు రాష్ట్రంలోని ప్రతి అవ్వా తాత ఇబ్బందులు ఎదుర్కోవడమే కాకుండా ప్రాణాలు సైతం పోగొట్టుకుంటున్నారని తెలిపారు. వాలంటీర్లను సేవ చేయకుండా చేసిన చంద్రబాబుకు పేదల ఉసురు తప్పకుండా తగులుతుందని పేర్కొన్నారు. పెన్షన్ తీసుకోవడానికి వెళ్లి ప్రాణాలు పోగొట్టుకున్న వారి కుటుంబాలకు ఎవరు సమాధానం చెబుతారని ప్రశ్నించారు. గడిచిన ఐదేళ్లలో ఇలాంటి సంఘటనలు ఎప్పుడూ జరగలేదని, పండగ రోజైనా, పెళ్లిళ్లు ఉన్నా, ఆదివారం అయినా మరేదైనా సరే ఆపకుండా పేదలకు సేవ చేస్తున్న వాలంటీర్లు అంటే అంత ద్వేషం ఎందుకు, అంత భయం ఎందుకు అన్నారు. “గడపగడపకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడం వాళ్లు చేసిన తప్పా? ప్రతినెల 1వ తేదీ రాగానే అవ్వ తాతలను నిద్రలేపి పెన్షన్ అందించడం వాళ్ళు చేసిన నేరమా? కరోనాలో వారు చేసిన సేవలకు దేశంలోనే గుర్తింపు పొందారు. కేవలం రూ. 5 వేలు భత్యం తీసుకుంటూ ప్రజలకు సేవ చేస్తున్న గ్రామ సేవకులు వాలంటీర్లు. ఐదు సంవత్సరాలుగా ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిలా నిలబడ్డ వాలంటీర్లను టీడీపీ నాయకులు వారిని తీవ్రవాదులు, ఉగ్రవాదులుగా చూపిస్తున్నారు” అని పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article