పోరుమామిళ్ల:తనపై అసత్య ప్రచారాలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. సోమవారం పొరుమామిళ్ళలో మాజీ ఎమ్మెల్యే కాంగ్రెసు నాయకురాలు కమలమ్మ మీడియా సమావేశంలో మాట్లాడుతూ
మా కుటుంబం రంగసముద్రం సర్వే నెంబర్ 1090, 1094 లో భూ కబ్జా చేసినారంటూ ధర్మ యుద్ధం పేరున కథనాలు రావడం అవాస్తవమని
నన్ను రాజకీయంగా ఎదుర్కోలేక కొందరు కుట్రలు చేస్తున్నారు.
ప్రజలకు సేవ చేయడానికి మేము రాజ కీయాలకు వచ్చినామన్నారు.
నేను ఒక సెంటు స్థలము కబ్జాచెసినారని నిరూపిస్తే రాజకేయ సన్యాసం తీసుకుంటానని చెప్పారు.
జాతీయ ఎస్సి కమిషన్ మెంబర్ గా పని చేసినపుడు ఎంతో మందికి సహాయం చెసినాను ఎవరికి అన్యాయం చేసే వ్యక్తిని కాదున్నారు
నాపై నాకుటుంబము పై అనవసర రాద్ధాంతాలు చేసే వారి పై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు కమల్ ప్రభాస్ పాల్గొన్నారు.