ప్రజా భూమి గండేపల్లి
గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య క్యాంపస్ నందు గల ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల అటానమస్ కు ఎన్ ఎ ఎ సి ఎ ++ (నాక్ – ఎ ++ ) గుర్తింపు లభించినట్లు ఆదిత్య విద్యాసంస్థల వైస్ చైర్మన్ డా. నల్లమిల్లి సతీష్ రెడ్డి తెలిపారు . నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడేషన్ కౌన్సిల్ వారు కళాశాలలో గల ల్యాబ్,లైబ్రరీ,ఉపాధ్యాయ,ఉపాద్యాయేతర సిబ్బంది మరియు మౌలిక సదుపాయాలు తదితర అంశాలను పరిశీలించిన త్రిసభ్య బృందం సిఫారసు మేరకు తమ ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలకు 3.60 స్కోర్ తో “నాక్ ఎ++” గుర్తింపు లభించినట్లు సతీష్ రెడ్డి తెలిపారు. భారతదేశంలోని విద్యాసంస్థల,యూనివర్సిటీ ల యొక్క క్వాలిటీ స్టేటస్,కరిక్యులం,టీచింగ్,లెర్నింగ్,ప్రాసెస్,ఫ్యాకల్టీ రీసర్చ్ కళాశాల మౌలిక వసతుల ఆర్థిక వనరులు తదితర అంశాలకు ప్రాధాన్యత క్రమంలో ప్రమాణాలుగా తీసుకొని ఈ గుర్తింపు ఇవ్వడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో క్యాంపస్ డైరెక్టర్. & ప్రిన్సిపాల్ డా. ఎమ్.శ్రీనివాస్ రెడ్డి, డీన్ లు డా. ఎస్.రమాశ్రీ, డా.జి.సురేష్, డా. కె.వి.ఎస్.రామచంద్ర మూర్తి, డా. టి. నరేంద్రుడు, ప్రో. జె. పవన్,ప్రో. జె.డి. వెంకటేష్ విభాగాధిపతులు తదితరులు పాల్గొన్నారు.