పులివెందుల
రాష్ట్రప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పేద ప్రజలకు అందిస్తున్న ఆరోగ్య శ్రీ కార్డులను ఆదివారం 26వ వార్డు కౌన్సిలర్ లక్ష్మీప్రసన్న నగరిగుట్ట 26వ వార్డులో ఏఎన్ఎం, ఆశా వర్కర్లు, వాలంటీర్లతో కలిసి అర్హులైన ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీ కార్డులను ఆమె చేతుల మీదుగా కంపెనీ చేయడం జరిగింది.ఈ సందర్భంగా ఆమె మాట్లాడు తూ గతంలో ఐదు లక్షల ఉండే పరిమితిని రాష్ట్ర ప్రభుత్వం మానవతా దృక్పథంతో 25 లక్షల వరకు పెంచిందని, క్యాన్సర్ ఉన్న వారిపై పరిమితి లేదు అని ఆమె అన్నారు.ప్రతి పేద కుటుంబం ఒక ఏడాది కాలంలో 25 లక్షల వరకు వైద్య సేవలు పొందవచ్చునని, వైద్య రంగంలో రాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చిందన్నారు. ప్రతి ఇంటికి ఆరోగ్య సేవలు అందేలా ప్రణాళికలను రూపొందించి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వైద్య సేవలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందన్నారు.