Friday, November 29, 2024

Creating liberating content

తాజా వార్తలుఇంటర్ ఫలితాల్లో రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించిన స్పేస్ విద్యా కుసుమాలు

ఇంటర్ ఫలితాల్లో రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించిన స్పేస్ విద్యా కుసుమాలు

కదిరి :ఆధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ మొదటి, ద్వితీయ సంవత్సరం ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో కదిరి రూరల్ పరిధిలోని కుమ్మరవాండ్లపల్లిలో ఉన్న స్పేస్ జూనియర్ కళాశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించినట్లు హరీష్ స్కూల్స్ విద్యాసంస్థల అడ్వైజర్ యం.యస్. ప్రశాంత్, కరస్పాండెంట్ యం.యస్. కిరణ్ తెలిపారు. మొదటి సంవత్సరం ఎంపిసి విభాగంలో సి. సంతోష్ కుమార్ 470 మార్కులకు గాను 465 మార్కులు తెచ్చుకొని రాష్ట్రస్థాయి 3వ ర్యాంక్ సాధించారు. పి. గణేష్, హెచ్.యస్. రాఫియా ఫిర్దోస్ లు 461 మార్కులు, యం.యస్. సానియా 459, వేదాంత్ 459 మార్కులు, యం.యస్. ఫిర్దోస్ 450 మార్కులు సాధించారు. బైపిసి విభాగంలో యం. దినేష్ 440 మార్కులకు గాను 431 మార్కులు సాధించి టౌన్ టాపర్ గా నిలిచారు. కౌసర్ 421, ఆలీషా 414, ఆసిఫాలకు 410 మార్కులు వచ్చాయి. సిఈసి విభాగంలో బల్కీష్, అభిషేక్ రావు 419 మార్కులు తెచ్చుకొని టౌన్ టాపర్ గా నిలిచారు. అదేవిధంగా ద్వితీయ సంవత్సరం ఎంపిసి విభాగంలో నాఫియా 978 మార్కులు సాధించి టౌన్ టాపర్ గా నిలిచింది. కీర్తన 926, అజ్రా 925, గాయత్రిలకు 923 మార్కులు వచ్చాయి. బైపిసి విభాగంలో పి. యశ్వంత్ కుమార్ 948, రూఖియా అంజూమ్ 925 మార్కులు సాధించి టౌన్ టాపర్ గా నిలిచారు. సిఈసి విభాగంలో కిరణ్ కుమార్ 950 మార్కులు సాధించి టౌన్ టాపర్ గా నిలిచినట్లు వారు వివరించారు. ఈ సందర్భంగా యం.యస్. ప్రశాంత్, యం.యస్. కిరణ్ లు మాట్లాడుతూ.. కార్పొరేట్ కళాశాలలకు ధీటుగా తమ కళాశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి ర్యాంక్ లు సాధించడం సంతోషదాయకమన్నారు. కార్పొరేట్ కళాశాలలకు మించి స్పేస్ కళాశాలలో నాణ్యమైన విద్యను అందిస్తున్నామని, ఇందుకు నిదర్శనం నేడు వెలువడిన ఫలితాలే అన్నారు. విద్యార్థులు పై చదువుల్లో ఇంకా మంచి ర్యాంక్ లు సాధించి, చరిత్ర సృష్టించాలని ఆకాంక్షించారు. మంచి ఫలితాలు సాధించేందుకు కృషి చేసిన అధ్యాపక బృందానికి వారు ధన్యవాదాలు తెలియజేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article