అమరావతి:“ ఏపీ అసెంబ్లీకి సంబంధించి జరుగుతున్న ఆఖరి సమావేశాల్లో జగన్ రెడ్డి తన మోసపూరిత చర్యలను, చేతగానితనాన్ని గవర్నర్ ప్రసంగం ద్వారా కప్పిపుచ్చే ప్రయత్నం చేశాడు. గవర్నర్ తో ముఖ్యమంత్రి సత్యదూరమైన అంశాలు చెప్పిం చాడు. మత్స్యకారుల్ని తానేదో ఉద్ధరించినట్టు గవర్నర్ తో చెప్పించారు. మత్స్య కార భరోసా గతంలో కంటే ఎక్కువగా ఇప్పుడు రూ.10 వేలు ఇస్తున్నట్టు జగన్ రెడ్డి చెప్పించారు.ఇచ్ఛాపురం నియోజకవర్గంలో ఒక్క మత్స్యకార కుటుంబానికైనా రూ.10లక్షల పరిహారం ఇచ్చినట్టు ముఖ్యమంత్రి నిరూపిస్తే, రాజకీయ సన్యాసం తీసుకుంటానని టీడీపీ శాసనసభ్యులు బెందాళం అశోక్ అన్నారు.
గతంలో టీడీపీప్రభుత్వం ఒక మత్స్యకార కుటుంబంలో ఎంత మంది ఉంటే అందరికీ భరోసా కింద రూ.4వేలు (ఒక్కొక్కరికీ) అందించింది. జగన్ రెడ్డి మాత్రం ఒక కుటుంబంలో ఒకరికే మత్స్యకార భరోసా సాయం అందిస్తున్నా డు. ఆ విషయం గవర్నర్ ప్రసంగంలో ఎక్కడాలేదు. దురదృష్టవశాత్తూ మత్స్యకా రులు చనిపోతే, వారి కుటుంబానికి ఇచ్చే ఎక్స్ గ్రేషియాను రూ.10లక్షలకు పెంచినట్టు జగన్ రెడ్డి చెప్పించారు. నా నియోజకవర్గం ఇచ్చాపురంలో ఎక్కువ మంది మత్స్యకారులే. ఇన్నేళ్లలో జగన్ రెడ్డి నా నియోజకవర్గంలో ఒక్క కుటుంబానికైనా రూ.10లక్షలు ఇచ్చినట్టు, ఒక్క క్లెయిమ్ అయినా పరిష్కరించి నట్టు నిరూపిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను. ఇలా అన్నీ అబద్ధాలే. అధికారంలోకి వచ్చాక నాలుగేళ్లలో ఉత్తరాంధ్రలో కేవలం 2 బహిరంగసభలు మాత్రమే పెట్టిన జగన్ రెడ్డి, మొన్న నిర్వహించిన ప్రచారసభలో కూడా ఆ ప్రాంత సాగునీటి ప్రాజెక్టులు గురించి మాట్లాడలేదు. వంశధారనదిని బాహుదా నదికి అనుసంధానిస్తూ చేపట్టిన ప్రాజెక్ట్ పూర్తయితే 2.50 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరించబడుతుందని జగన్మోహన్ రెడ్డికి తెలియదా? గతప్రభుత్వం చంద్రబాబు హయాంలో రూ.600 కోట్లతో డీపీఆర్ లు సిద్ధంచేసిన ప్రాజెక్టుల్ని కూడా జగన్ ఆపేయించి, ఉత్తరాంధ్ర రైతులకు తీరని అన్యాయం చేశాడు. శాంతి భద్రతలపై కూడా గవర్నర్ తో అబద్ధాలు చెప్పించారు. విశాఖపట్నంలో తహసీల్దార్ ను చంపేస్తే ఈ ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. సభలో గవర్నర్ మాట్లాడుతుంటే చప్పట్లు కొట్టడం, బల్లలు చరవడం కాదు చేయాల్సింది. ముఖ్య మంత్రి ప్రజల్లోకి వెళ్తే వారి కష్టాలు, బాధలు ఏంటో తెలుస్తాయి. ప్రజల్ని మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్న జగన్ రెడ్డిని వారు విశ్వసించే పరిస్థితి లేదు. గవర్నర్ ప్రసంగం ఆద్యంతం అసత్యాలతో నిండి ఉన్నందునే తామంతా సభల్ని బహిష్కరించాం. ” అని అశోక్ స్పష్టం చేశారు.