లేపాక్షి :-లేపాక్షి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గోపి గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు, ఎస్పీ మాధవరెడ్డి ల చేతుల మీదుగా ఉత్తమ ఎస్ఐ అవార్డును అందుకున్నారు. ఇటీవల పర్యాటక కేంద్రమైన లేపాక్షికి భారత ప్రధాని నరేంద్ర మోడీ విచ్చేశారు. ప్రధాని రాక సందర్భంగా ఎస్సై గోపి ఉత్తమ సేవలను అందజేశారు. అదేవిధంగా లేపాక్షి మండలానికి ఎస్సై గా గోపి బాధ్యతలు స్వీకరించిన తర్వాత మండలంలో శాంతి, భద్రతలు కూడా అదుపులోకి వచ్చాయి. ఎస్సై గోపి తన బాధ్యతలను చక్కగా నిర్వహించడం తో అతనికి ఘనతంత్ర దినోత్సవ సందర్భంగా ఉత్తమ ఎస్ఐ గా అవార్డును అందుకున్నారు. ఉత్తమ ఎస్ఐగా అవార్డును అందుకున్న ఎస్సై గోపిని వైకాపా మండల కన్వీనర్ నారాయణస్వామి, మండల ఉపాధ్యక్షులు ఆంజన రెడ్డి, మండల టిడిపి కన్వీనర్ జయప్ప, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వేణుగోపాల్ రెడ్డి, సింగిల్ విండో అధ్యక్షులు రమేష్ రెడ్డి, సర్పంచులు ఆదినారాయణ, నాగేంద్ర కుమార్, మంజునాథ్, నిర్మలమ్మ వేణుగోపాల్ రెడ్డి, నందిని, మండల వ్యవసాయ శాఖ సలహా మండలి అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్, తదితరులు ఉత్తమ అవార్డును అందుకున్న లేపాక్షి ఎస్ఐ గోపికి శుభాకాంక్షలు తెలిపారు.