Thursday, November 28, 2024

Creating liberating content

తాజా వార్తలుఉమ్మడి తొలి బహిరంగ సభను విజయవంతం చేయండి!

ఉమ్మడి తొలి బహిరంగ సభను విజయవంతం చేయండి!

జనసేన ఇంచార్జి చంద్రశేఖర్ పార్టీ శ్రేణులకు పిలుపు. కాజులూరులో పార్టీ శ్రేణులతో పోస్టర్ విడుదల చేసిన చంద్రశేఖర్.

రామచంద్రపురం (కాజులూరు)

తాడేపల్లిగూడెం వద్ద ప్రత్తిపాడు లో రాష్ట్ర స్థాయిలో ఈనెల 28న జగనున్న జనసేన-టీడీపీ పార్టీల ఉమ్మడి తొలి బహిరంగ సభ ను విజయవంతం చేయాలని రామచంద్రపురం జనసేన పార్టీ ఇంచార్జి పోలిశెట్టి చంద్రశేఖర్ ఆపార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈమేరకు
ఆదివారం మండల కేంద్రమైన కాజులూరులో మండల అధ్యక్షులు బొండా వెంకన్న అధ్వర్యంలో శ్రీ వెంకటసత్య కళ్యాణమండపంలో జనసేన పార్టీ శ్రేణులతో సమావేశం
నిర్వహించారు.ఈ కార్యక్రమానికి రామచంద్రపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంఛార్జి పోలిశెట్టి చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈసందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ జనసైనికు లంతా పార్టీ సిద్దాంతాలకు అనుగుణంగా రానున్న ఎన్నికల్లో పాటుపడదామని ఈసందర్భంగా పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.వచ్చే బుధవారం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ప్రత్తిపాడులో జరగనున్న బారీ బహిరంగ సభ కు రామచంద్రపురం నుండి అదిక సంఖ్యలో జనసమీకరణ చేసి తరలి వెళ్ళెందుకు సమావేశంలో చర్చలు జరిపి దిశ నిర్దేశాలు చేసారు. నియోజకవర్గంనుడి బారీస్తాయిలో జనసైనికులు తరళివెళ్ళి బహిరంగ సభ ను విజయవంతం చేయాలని కోరారు.ఈసందర్భంగాఇంచార్జి చంద్రశేఖర్ చేతులు మీదుగా ఆపార్టీ శ్రేణులతో జనసేన పోస్టర్ ని విడుదల చేసారు.ఈ సమావేశంలో జనసేన పార్టీ కాజులూరు మండల యువత అద్యక్షులు కూనపరెడ్డి శివకృష్ణ,కాజులూరు ఉపాధ్యక్షులు యాళ్ళ వెంకటరమణ, సంయుక్త కార్యదర్శి వేణుగోపాలరావు ,గంగవరం మండల అధ్యక్షులు చిర్రా రాజ్ కుమార్,రామచంద్రపురం రూరల్ మండల అధ్యక్షులు పోతాబత్తుల విజయ్ కుమార్, జిల్లా కార్యదర్శులు సంపత్ సత్యనారాయణ, రామచంద్రపురం రూరల్ వైస్ ప్రెసిడెంట్ గుబ్బల శ్రీనివాస రావు, రామచంద్రపురం టౌన్ యువత అధ్యక్షలు మట్ట దుర్గారావు, ఎంపీటీసీలు షేక్ బాబాజీ సాహెబ్ ,కొప్పిశెట్టి కృష్ణమూర్తి, గొల్లపల్లి సింహద్రిరావు, గరగ కొండలరావు,సలాది పుస్ఫావతి, యాళ్ల రవి,చొడిశెట్టి శ్రీను,పెమ్మనబోయున రత్నా కుమార్,కొండమూరి సత్యనారాయణ, పోలిశెట్టి పెద్దబాబు, నామ్ముల నాగేశ్వరరావు,పడాల లోవరాజు, చల్లా బుజ్జి, కొట్టు సాయి చందు,నున్న వెంకటేశ్వరరావు,పడాల శ్రీను తదితర కాజులూరు మండల జనసేన నాయకులు, జనసైనికులు బారీస్తాయిలో పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article