కడప సిటి: కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు- బండి జకరయ్య, ప్రధాన కార్యదర్శి-అబ్దుల్ సత్తార్ గార్లు మాట్లాడుతూ,దేశంలో ఇప్పటివరకు 60% ప్రజలు వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. మనది వ్యవసాయ ఆధారిత దేశం. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో నాగార్జునసాగర్ వంటి భారీ తరహా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతో నాంది పలికింది. 1966-67 ఆర్థిక సంవత్సరంలో మొదటిసారి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పంటకు కనీస మద్దతు ధర ప్రకటించింది. కానీ రైతులు స్వామినాథన్ కమిటీ రిపోర్టును అమలు చేయాలని ఢిల్లీలో 365 రోజులు ఆందోళన నిర్వహించి, ఆందోళనలసందర్భంగా 720 మంది రైతులు బిజెపి ప్రభుత్వం ఉత్తుత్తి హామీలు ఇచ్చి ఆ తరువాత కార్యాచరణ రూపు దాల్చలేదు. మళ్లీ దేశవ్యపతంగా రైతాంగం ఫిబ్రవరి 21వ తారీకు నుండి ఢిల్లీలో తిరిగి ఆందోళనలు ప్రారంభించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రైతుల కోసం పంటకు కనీస మద్దతు ధర అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తామని అలాగే స్వామినాథన్ కమిషన్ రిపోర్టును అమలు చేస్తామని ప్రకటించింది. దీనికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళముగా మేము చాలా సంతోషిస్తున్నాం. వ్యవసాయ రంగానికి పెద్దపీటవేసి మొదటి నుండి రైతాంగాన్ని ఆదుకుంటున్నది కాంగ్రెస్ పార్టీఏనని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఏఐసిసి పిలుపుమేరకు సభలు సమావేశాలు నిర్వహించి ఈ విషయమై రైతులలో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తామని,అందుకోసం పోరాడుతామని పేర్కొన్నారు. ఈ మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి గారు పాల్గొన్నారు.