సిపిఐ జిల్లా కార్యదర్శిసిపిఐ నేత మన్నవ కృష్ణ చైతన్య!
వేలేరుపాడు :ఎన్నికల సమయం ఆసన్నమైందని ప్రతి ఓటరు మంచి నాయకుడిని ఎన్నుకోవటానికి సిద్ధం కావాలని సిపిఐ జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య మండల ప్రజలకు కుట్టి పిలుపునిచ్చారు. వెలేరుపాడు లోని సిపిఐ కార్యాలయంలో మండల కార్యవర్గ సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణ చైతన్య మాట్లాడుతూ, ప్రజా సమస్యలు తెలిసిన వ్యక్తి తమ నాయకుడుగా ఉండటం వలన అవి పరిష్కారం అవుతాయన్నారు. ప్రభుత్వాలు మారిన నిర్వాసితుల సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. కాళ్లు అరిగేలా కార్యాలయాల చుట్టూ తిరిగిన పట్టించుకునే వారే కరువయ్యారన్నారు. గడిచిన పదేళ్లుగా నిర్వాసితులు అనేక విధాలుగా సమస్యలు ఎదుర్కొంటున్నారని, గోదావరి వరదల సమయంలో పడే బాధలు వర్ణనాతీతమన్నారు. అవి కళ్ళారా చూసిన పాలకులకు కనికరం లేదన్నారు. సమస్యలు తెలిసిన నాయకుడు వాటి పరిష్కారం కోసం నిరంతరం పోరాడే నాయకుడును ప్రజాప్రతినిధిగా ఎన్నుకోవాలన్నారు. నిర్వాసితుల పక్షాన సిపిఐ అనేక పోరాటాలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. 2013 చట్ట ప్రకారం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ రావడానికి, ప్రతి ఎకరానికి 10 లక్షలు నష్ట పరిహారం ఇవ్వడంలో సిపిఐ పోరాటం మరువలేనిదన్నారు. నిరంతరం ప్రజా సమస్యలపై అనేక మార్గంలో భారత కమ్యూనిస్టు పార్టీ పోరాటం కొనసాగిస్తున్నారు. రానున్న ఎన్నికల్లో ఇండియా కూటమితో సిపిఐ ముందుకు సాగుతుందన్నారు.ఈ సమావేశంలో రాష్ట్ర సమితి సభ్యులు ఎండీ మునీర్, జిల్లా కార్యవర్గ సభ్యులు సన్నేపల్లి సాయిబాబు, ఏపీజిఎస్ రాష్ట్ర అధ్యక్షులు కారం ధారయ్య, రామవరం సర్పంచ్ పిట్ట ప్రసాద్, జంగారెడ్డిగూడెం మండల కార్యదర్శి రమణ రాజు, ఎర్ర మధు, కరటం సీతామహాలక్ష్మి, పిట్ట జయమ్మ, పిట్ట వీరయ్య, కరటం వెంకటేశ్వర్లు, ఎస్కే గౌస్, బంధం అర్జున్, ప్రసాద్, దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.