కామవరపుకోట :ఎన్నికల నిబంధనల ప్రకారం వాహనాలను తనిఖీ చేస్తున్నట్లు కామవరపుకోట మండల ఎన్నికల ఎస్ఎస్ టీమ్ అధికారి మొహిద్దిన్ తెలిపారు. శనివారం స్థానిక ఆర్ అండ్ బి బంగ్లా సమీపంలో ఎన్నికల చెక్పోస్టులో పలు వాహనాలను తనిఖీ చేశారు. పర్మిషన్ లేని పార్టీ జెండా కలిగిన వాహనాల నుండి జండాలను తొలగింప చేశారు. పలు వాహనాలను తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా మోహిద్దిన్ మాట్లాడుతూ ఎన్నికలలో ఓటర్ లను ప్రలోభ పెట్టడానికి రవాణా చేసే మద్యం, చీరలు, నగదు వంటి వాటిని రవాణా జరుపుతున్నట్లయితే తనిఖీలు నిర్వహించి ఎన్నికల నిబంధనలకు మించి ఉన్నట్లయితే సీజ్ చేయనున్నట్లు తెలిపారు. ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు కమిటీ పని చేస్తుందని చెప్పారు. టీంలో హెడ్ కానిస్టేబుల్ రమేష్, కానిస్టేబుల్ రామకృష్ణ, ఫోటోగ్రాఫర్ మధు పాల్గొన్నారు.