కదిరి :రాబోయే సార్వత్రిక ఎన్నికలలో కదిరి అసెంబ్లీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న బి.ఎస్ మక్బూల్ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. గురువారం పట్టణంలోని 21వ వార్డులో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని ఓట్లు అభ్యర్థించారు. ఓట్లు అడిగేందుకు వెళ్తున్న మక్బూల్ ప్రజల ఆదరణ చూసి ఆనందం వ్యక్తం చేశారు. అదేవిధంగా వార్డు ప్రజలు మమ్మల్ని స్వాగతించిన తీరుతో పాటు మా ఓటు ఫ్యాన్ గుర్తుకే అని చెబుతుండడంతో రెండవసారి జగనన్న ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమనే సందేశాన్ని ఇస్తున్నారన్నారు. మరోవైపు వైసీపీ ప్రచార హోరు, ప్రతిపక్షాలు బేజారు అనే విధంగా ఓటర్లు సైతం చర్చించుకోవడం విశేషం. ఈ సందర్భంగా ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాలు అందించాలంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యమన్నారు. గడచిన ఐదేళ్లలో రాష్ట్ర ప్రజలకు అందించిన సంక్షేమంతో పాటు అభివృద్ధిని చూసిన ప్రతి ఒక్కరూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర సీఈసీ సభ్యులు పూల శ్రీనివాసరెడ్డి, పట్టణ అధ్యక్షులు జిలాన్ బాషా, వైసీపీ నాయకులు పరికి సాదిక్ బాషా, మున్సిపల్ కౌన్సిలర్లు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు.