ఎన్నికల బాండ్లు బయట పెట్టేంత వరకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయరాదు సిపిఐ
పోరుమామిళ్ల:పోరుమామిళ్లలోని ఎస్ బి ఐ బ్యాంక్ ఎదుట సిపిఎం ఆధ్వర్యంలో ఎన్నికల బాండ్లు వివరాలు బయట పెట్టాల్సిందే అని బ్యాంకు ఎదురుగా నిరసన ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది ఈ సందర్భంగా సిపిఎం పోరుమామిళ్ల మండల కార్యదర్శి యన్ భైరవ ప్రసాద్ మాట్లాడుతూ తక్షణమే ఎన్నికల బాండ్లు వివరాలను సుప్రీమ్ కోర్టు తీర్పు ప్రకారం బహర్గతంచేయాలన్నారు ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్ బి ఐ సిబ్బందిని ఆదేశించాలని 80 మంది రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు ఎన్నికల సంఘాన్ని కోరారన్నారు ఎస్ బి ఐ కి ఓ బహిరంగ లేఖ రాయడం జరిగిందని వారు అన్నారు. ఈ బాండ్లు సమాచారం అంతా అందజేసేంతవరకు 2024 సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించరాదని వారు ఆ లేఖలు రాశారని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన గడువును ఎస్ బి ఐ ఉల్లంఘించిన నేపథ్యంలో ఈ లేఖవెలబడింది అని వారన్నారు. ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించి మార్చి 6తేదీ కల్లా ఈ వివరాలను ఎన్నికల సంఘానికి అందజేయాలని సుప్రీంకోర్టు ఆదేశించగా ఈ గడువు ముగియడానికి ఒకరోజు ముందే అంటే ఎన్నికల బాండ్లను రద్దు చేసిన 17 రోజుల తర్వాత ఎస్బిఐ తమకు జూన్ 30వరకు గడువు కావాలంటూ సుప్రీంకోర్టుకు దరఖాస్తు చేయడం ఎంత మాత్రం సమర్ధనీయం కాదని వారు ఆవేదన వ్యక్తం చేసినారు అని ఆయనన్నారు ఈ లేకపై సంతకాలు చేసిన వారిలో ఐఏఎస్ (రిటైర్డ్ )అనిత అగ్నిహోత్రి, సామాజిక న్యాయం సాధికారత శాఖ మాజీ కార్యదర్శి జి బాలచంద్రన్, పశ్చిమబెంగాల్ మాజీ అదనపు చీప్ సెక్రటరీ గోపాలం, బాలగోపాల్ బొగ్గు శాఖ, మాజీ కార్యదర్శి రాజా బెనర్జీ తదితరులు ఆ లేక పై సంతకాలు చేశారని వారన్నారు. ఎస్ బి ఐ 48 కోట్ల ఖాతాలు కలిగిన ఉన్నత స్థాయిలో డిజిటలేషన్ జరిగిన దేశంలోనే అతిపెద్ద బ్యాంకు అన్నారు బ్యాంకు రికార్డులు రాతపూర్వకంగా భద్రపరిచామనే పేలవమైన సాకు చూపి గడువు పొడిగించమని కోర్టును కోరడం హాస్యాస్పందంగా ఉందని వారు ఆ లేఖలో వారు వ్యాఖ్యానించారని ఆయనన్నారు అసలు ఈ బాండ్లు సమాచారం మొత్తం ప్రక్రియను 10 నిమిషాల కన్నా ఎక్కువ పట్టదని థామస్ ప్రాంకో మాజీ ఆర్థిక కార్యదర్శి సుభాష్ వంటి బ్యాంకింగ్ రంగ నిపుణులే చెప్పారని ఆయన అన్నారు ఈ లేఖ రాసిన మాజీ అత్యున్నత సివిల్ సర్పెంట్లు కానిస్టిట్యూషనల్ కండక్ట్ గ్రూపు (సిసిజి)లో భాగంగా ఉన్నారన్నారు వీరు ఏ రాజకీయ పార్టీకీ అనుబంధంగా లేరుఅని ఆయనన్నారు నిష్పక్షపాతంగా, తటస్థత పట్ల నమ్మకం, భారత రాజ్యాంగం పట్ల నిబద్ధత కలిగిన వార అని ఆ లేఖలో రాశారనిఆయన్నారు.
సార్వత్రిక ఎన్నికల్లో తాము సమాచారం అందించమని చెప్పడం చూస్తుంటే అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వంపై ఎలాంటి విమర్శలు రాకుండా కాపాడేందుకు ఎస్ బి ఐ ఒక కవచంలా వ్యవహరిస్తూ ఉన్నట్లు కనిపిస్తుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు బాండ్లు ఇచ్చిన వారికి తీసుకున్న వారికి మధ్య క్విడ్ ప్రోకోఅంటే (నీకు ఇది నాకు ఇది) బాగోతం నడిచిందనిఆయన్నారు వారు కొన్నిసార్లు తమకు అనుకూలంగా లేని కార్పొరేట్లపై ఒత్తిడి తెచ్చేంత కొన్ని సంస్థలతో దాడులు బెదిరింపులకు దిగారని పేర్కొన్నారు విరాళాలు ఇచ్చిన వారికి ప్రభుత్వం చేసి పెట్టిన పనులు వివరాలు కూడా బయటకు రావాలని వారు కోరారు అని వారన్నారు రాజ్యాంగంలోని 324 అధికరణ కింద తనకు సంక్రమించిన అధికారులను ఉపయోగించడం ద్వారా తన పేరు ప్రతిష్టలను సమగ్రతను ఎన్నికల కమిషన్ తిరిగి నిలబెట్టుకోవాలని అందుకు ఇదొక అవకాశం అని ఎన్నికల కమిషన్ కు వారు ఈ లేఖలో రాశారని వారన్నారు వెంటనే ఎన్నికల బాండ్లు వివరాలు బయట పెట్టాలి , ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధం అని, బాండ్లు అమ్మినవారిపేర్లు ,కొన్న వారివివరాలు బయటపెట్టాలనీ, ఎన్నికల సంఘానికి13వతేదిలోపల బాండ్లు వివరాలు బహిర్గతం చేయాలని, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం వెంటనే అమలు చేయాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేశారు కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు షేక్ గౌసియాభేగం, బీబి, లూర్దుమేరి, సుందరయ్య, బొజ్జా చిన్నయ్య,రవి, రత్నం, వెంకటలక్ష్ముమ్మ, ఓబులమ్మ, లక్ష్మమ్మ పార్టీ సభ్యులు పాల్గొన్నారు.