విజయవాడ:ఏడుకొండల వాడ స్వామి ఎన్నేన్ని లీలలో కదా అన్నట్లు…
వేయిపడగల వాడా నీకు వేల వేలు దండాలు… అన్నట్లు…ఓ ఆదిపరాశక్తి బెజవాడ దుర్గమ్మ నీ చూపులే చాలు…
ఇక ఓ నారీమణికి పూజచేస్తే కోటి జన్మల పుణ్యంబు అన్నట్లుగా…అక్రమ నిర్మాణాలు
మూడు పువ్వులు ఆరుకాయలుగా యథేచ్ఛగా జరుగుతున్నా అడిగే నాధుడు లేక పోయారు…
ఈ బెజవాడ కార్పొరేషన్ లో…కాసుల కోసం కక్కుర్తి పడుతున్న
కార్పొరేషన్ లోని కొంతమంది అవినీతి అధికారులు ఆ ప్రాంత కార్పొరేటర్ కు కొమ్ముకాస్తూ
కాసుల వర్షం కురిపించు కుంటూ కమ్మగా కాలాన్ని వెళ్లబుచ్చుతున్నారు. ఇదంతా దినసరి భాగమైన వీరి
ఆగడాలకు కళ్లెం వేసేవారు లేకపోవడం దురదృష్టకరం..