బ్రహ్మశ్రీ మాడుగుల శివప్రసాద్ శర్మ గురూజీ
మనసులో ఎటువంటి ఆందోళన లేకుండా ఉండాలంటే ఓంకారాన్నిజపించాలని బ్రహ్మశ్రీ మాడుగుల శివప్రసాద్ శర్మ గురూజీ చెబుతున్నారు. మిగిలిన శబ్దాలతో పోలిస్తే ఓంకారం నుంచి పుట్టే ధ్వని మనసుకు ఎంతో శాంతిని కలిగిస్తుంది.ఎందుకంటే అన్ని శబ్దాలకు నాంది ఓంకారమేనని శాస్త్రాలు చెబుతున్నాయి. ప్రకృతిలో కూడా ఓంకార శబ్దానికి ఎంతో విశిష్టత ఉందని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఓంకారాన్ని ఉచ్చరించినప్పుడు శరీరంలో ఒక రకమైన ప్రకంపనలు వస్తాయని గురూజీ చెబుతున్నారు.ఎంత ఒత్తిడి ఉన్న శరీరానికి ఉపశమనం కలుగుతుంది. మనకి తెలియకుండానే ఏదో ఒక శక్తి లోపలికి ప్రవేశించిన భావన ఏర్పడుతుంది. ఓంకారాన్ని చక్కగా ఉచ్చరించగలిగితే ఆరోగ్యపరంగా ఎంతో మేలు జరుగుతుంది. డాక్టర్ల చుట్టూ తిరగాల్సిన పని కూడా ఉండదని వేద గురూజీ చెబుతున్నారు. నాభి నుంచి ఓంకార శబ్దాన్ని పలికితే ఊపిరితిత్తులు శుభ్రపడతాయని శాస్త్రీయంగా తెలిసింది. 32 సెకండ్ల పాటు ఈ శబ్దాన్ని పలికితే ఆ ఫలితాలు వేరుగా ఉంటాయి.గుండె కు జరిగే రక్త రక్తప్రసరణ సవ్యంగా జరుగుతుంది. రోజుకు కనీసం పావు గంట అయినా ఈ శబ్దాన్ని పలికితే ఒంట్లో ఉండే ఒత్తిడి మొత్తం దూరం అయిపోతుంది. అంతేకాకుండా అధిక బీపీ కూడా అదుపులో ఉంటుంది. మెడిటేషన్ చేసేవారు 21సార్లు ఓంకార శబ్దాన్ని పలికితే ఆరోగ్యానికి ఎంతో మంచిదని వేదగురూజీ చెబుతున్నారు. అంతేకాకుండా ఒక మతానికి సంబంధించిన విషయంగా దీనిని చూడవద్దని గురూజీ చెబుతున్నారు. థైరాయిడ్ సమస్యతో బాధపడేవారు ఓంకారం ఉచ్చరించడం వల్ల వారికి రోగం నుంచి విముక్తి కలుగుతుంది. గొంతులో నుంచి పలికే ఈ బ్రహ్మాండ శబ్దంతో ఉత్పత్తి చేసే హార్మోన్లు సక్రమంగా పనిచేస్తాయని చెబుతున్నారు.పూర్వం రోజులలో ఋషులు రోజులు తరబడి నిద్రాహారాలు మాని ఘోరమైన తపస్సు చేయగలిగారంటే అది ఈ శబ్దానికి ఉన్న పవర్ ను అర్థం చేసుకోవచ్చు.ఓంకారం వల్ల వచ్చే శక్తి వల్ల వాళ్లు అలా ఆరోగ్యంగా జీవించారనిబ్రహ్మశ్రీ మాడుగుల శివప్రసాద్ శర్మ గురూజీ చెబుతున్నారు.