నిజాయితీగా ఓటు వేయండి .అని 2004 ఎన్నికల నుండి ప్రచారం చేస్తూ వస్తున్నాను. అందులో భాగంగా 2023 తెలంగాణ ఎన్నికలను పురస్కరించుకొని ఓటరు చైతన్య రథాన్ని మొదలు పెట్టడం జరిగింది. ఈ రథం ప్రచారం మొదలు పెట్టీ నేటికీ 90 రోజులు సందర్భంగా పోస్టర్ విడుదల చేయడం జరిగింది అని రాళ్లపేట కృష్ణ అన్నారు.
1.ఓటర్లు డబ్బులు తీసుకోకుండా ఓటు వేయాలని ప్రజల నిర్ణయాధికారాల మీదే నాయకులు గెలుస్తారని
అందుకొరకు
3 ఎన్ని పనులు ఉన్నా ఎంత దూరమైనా మీ ఓటు హక్కు వినియోగించుకోవాలని
4 ప్రజలు ఓటును వృధా చేయకూడదని
5 ఓటు వేసే రోజున సెలవు దినంగా చూడకూడదని మన భవిష్యత్తును మార్చే ఒక అద్భుతమైన రోజుగా చూడాలని నా ఉద్దేశం
6.నీతి న్యాయం ధర్మం కోరుకునే మనం ఓటు విషయంలో కూడా పాటించాలని నా ప్రగాఢ నమ్మకం
- ఓటు ఒక వర్తమాన ఆయుధం
8.100% ఓటింగ్ జరిగినప్పుడే నిజమైన నాయకత్వం వస్తుందని నా నమ్మకం
9.. ఓటు హక్కు ఉండి ఓటు వేయకుండా వృధా చేసే వాళ్ళలో మార్పు తీసుకురావడం
10.ఎవరైనా ఓటు కోసం డబ్బులు ఇవ్వాలని చూసినప్పుడు ఒక గ్రామానికి గ్రామంగానీ ఒక కాలనీ కాలనీ గాని వ్యతిరేకించి అభివృద్ధిని సాధిస్తారని నా ప్రయత్నం అని ఆయన తెలిపారు.