తనకల్లు మండలంలోని పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం.
తనకల్లు:తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టో పై గ్రామీణ ప్రజానికం హర్షం వ్యక్తం చేస్తున్నారు. అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసే విధంగా ఎన్డీఏ కూటమి మేనిఫెస్టోను ప్రకటించడం మంచి పరిణామమని ప్రజలు తెలుపుతూ ఎన్నికల్లో టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి కందికుంట వెంకట ప్రసాద్ ను గెలిపించి తీరుతామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోసారి మోసం చేయడానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధమయ్యారని, జగన్ విడుదల చేసిన మేనిఫెస్టో ను నమ్మే పరిస్థితిలో లేమని ప్రజలు తెలుపుతున్నారు.ఒక్క ఛాన్స్ తో రాష్ట్రం దివాలా తీసిందని, మరోసారి మోసపోవడానికి సిద్ధంగా లేమని, ఎన్నికల్లో గట్టిగా జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డికి ఓటు వేసే ప్రసక్తే లేదని టిడిపి పార్టీకి ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించి తీరుతామని ఎన్నికల ప్రచారంలో ఆయా గ్రామస్తులు తెలిపారు. శనివారం శ్రీ సత్యసాయి జిల్లా తనకల్లు మండలంలోని కొక్కంటి క్రాస్, బాలసముద్రంతదితర గ్రామలలో టీడీపీ నాయకులు జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయా గ్రామాలలో ఇంటింటికి వెళుతూ వైకాపా ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను వివరిస్తూ ఎన్డీఏ కూటమి అధికారం చేపట్టిన తర్వాత చేపట్టబోయే సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను పూర్తిస్థాయిలో వివరించారు. ఎన్డీఏ కూటమి విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టో తోపాటు సూపర్ సిక్స్ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లారు. మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సు ప్రయాణం, ఆడబిడ్డ నిధి కింద 18 సంవత్సరాలు నిండిన మహిళలకు నెలకు 1500 రూపాయలు చొప్పున అందజేసే గొప్ప కార్యక్రమాలు చేపడతామని ప్రజలకు తెలుపుతూ ముందుకు సాగారు. రైతన్నలు వైసీపీ ప్రభుత్వంలో తీవ్రంగా నష్టపోయారని ఎన్డీఏ కూటమి అధికారం చేపట్టిన తర్వాత 20 వేల రూపాయలు అందజేసే కార్యక్రమం చేపడతామన్నారు. నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస బాట పట్టాల్సిన దుస్థితి రాష్ట్రంలో నెలకుందని టిడిపి అధికారం చేపట్టిన తర్వాత పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొచ్చే విధంగా చొరవ తీసుకుని ఐదు సంవత్సరాలలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించే విధంగా చంద్రబాబు నాయుడు కృషి చేస్తారని తెలిపారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశము వచ్చేవరకు నెలకు ₹3,000 చొప్పున అందిస్తారన్నారు. ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు అందించే కార్యక్రమం కూడా చేపడతామన్నారు. సంక్షేమంతో పాటు పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టే విధంగా చంద్రబాబు నాయుడు చొరవ తీసుకుంటారని ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి కందికుంట వెంకటప్రసాద్ ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అంతకుముందు ఆయా గ్రామాలలోకి రాగానే మహిళలు, టిడిపి శ్రేణులకు హారతులు పడుతూ ఘన స్వాగతం పలుకుతూ పూల వర్షం కురిపించారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో తీవ్రంగా నష్టపోయామని మరోసారి జగన్ కు ఓటు వేస్తే రాష్ట్రం అధోగతి పాలయితుందని ప్రజలు తెలుపుతున్నారు. మరోసారి జగన్ చేతిలో మోసపోవడానికి ఎవరు సిద్ధంగా లేరని, ఒక్క ఛాన్స్ తో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్ కు ఓటుతో గట్టిగా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని ప్రజలు ధీమాగా తెలుపుతున్నారు. అబద్దాలకు కేరాఫ్ జగన్ అండ్ కో అని ఎట్టి పరిస్థితుల్లోనూ వారి మాటలు నమ్మే పరిస్థితిలో మేము సిద్ధంగా లేమని ఆయా గ్రామస్తులు తెలుపుతూ ఎన్నికల ప్రచారంలో హుషారుగా పాల్గొన్నారు. సైకిల్ గుర్తుకు ఓటు వేసి అఖండ మెజారిటీతో కందికుంట వెంకటప్రసాద్ ను గెలిపించుకుంటామని ఆయా గ్రామస్తులు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం మండలకన్వీనర్ రెడ్డి శేఖర్ రెడ్డి, తెలుగుయువత నాయకులు ప్రవీన్ కుమార్, నాగభూషణ,మాబాషా, రెడ్డిప్పరెడ్డి, బాలప్ప, మీరాసి వేమనారాయణ, గోవిందు, అరటికాయల రవి,పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.