కదిరి:శ్రీసత్యసాయి జిల్లా పెనుగొండ సమీపంలోని కియా కంపెనీ వద్ద సోమవారం ఏర్పాటు చేసిన ‘రా..కదిలి రా’ సభకు కదిరి నియోజకవర్గం నుండి తరలివెళ్లిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు కదిరి టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి కందికుంట వెంకట ప్రసాద్ ఆధ్వర్యంలో దాదాపు 6 వేల మందికి విందు భోజనాలు పెట్టారు. కాగా చంద్రబాబు నాయుడు హాజరయ్యే ఈ సభకు కదిరి నియోజకవర్గం నుండి టీడీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. ‘జై కందికుంటా.. కందికుంట నాయకత్వం వర్ధిల్లాలి’ అనే నినాదాలతో టీడీపీ శ్రేణులు వాహనాల్లో తరలివెళ్లడం కన్పించింది.