పులివెందుల
పులివెందుల పట్టణంలోని ముద్దనూరు రోడ్డు శ్రీ వాసవి కాలనీలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవా లయంలో స్వాతి జన్మ నక్షత్రాన్ని పురస్కరించుకొని ఆలయ అర్చకులు వేణుగోపాల స్వామి ఆధర్వం లో శ్రీ లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవాన్ని కన్ను ల పండుగగా నిర్వహించారు స్వామి వారి జయంతి సందర్భంగా స్వామివారికి ప్రత్యేకం గా అలంకరించి పంచామృతాభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు సాయంత్రం వేద,మంత్రో చ్ఛరణనాల మధ్య కళ్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కళ్యాణోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి కాయ కర్పూరం సమర్పించి తీర్థప్రసాదాలు అందుకున్నారు. అనం తరం రాత్రి ఆలయ కమిటీ సభ్యులచే అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.