Saturday, November 30, 2024

Creating liberating content

తాజా వార్తలుకృష్ణవేణి సంగీత నీరాజనాన్ని ఘనంగా నిర్వహిద్దాం… కేంద్ర పర్యాటక శాఖ కార్యదర్శి వి. విద్యాపతి.

కృష్ణవేణి సంగీత నీరాజనాన్ని ఘనంగా నిర్వహిద్దాం… కేంద్ర పర్యాటక శాఖ కార్యదర్శి వి. విద్యాపతి.

కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో డిసెంబర్ 10వ తేది నుండి 12 వరకు విజయవాడలో నిర్వహించనున్న కృష్ణవేణి సంగీత నీరాజనాన్ని ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వ పరంగా పూర్తి సహాయ సహకారం అందించాలనని కేంద్ర పర్యాటక శాఖ కార్యదర్శి వి. విద్యావతి కోరారు.

డిసెంబర్ 10 నుండి 12 వరకు విజయవాడలో కృష్ణవేణి సంగీత నీరాజనం నిర్వహణకు చేపట్టవలసిన ఏర్పాట్లపై కేంద్ర పర్యాటక శాఖ కార్యదర్శి వి. విద్యావతి శనివారం నగరంలోని హోటల్ వివంతలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి రజిత్ భార్గవ్, జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు, సబ్ కలెక్టర్ అదితి సింగ్, మున్సిపల్ కమీషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, సంబంధిత అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు.

సమావేశంలో విద్యావతి మాట్లాడుతూ సాంస్కృతి, సాంప్రదాయాలలో తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని మరియు వారసత్వాన్ని వెలుగులోకి తీసుకురావడానికి పురాతన కళలైన హరికథ, నామసంకీర్తనలపై ప్రజల దృష్టిని పునరుద్ధరించేందుకు కృష్ణవేణి సంగీత నీరాజనాన్ని నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. ఇందులో భాగంగా ఆంధ్ర ప్రదేశలో జీవం పోసుకున్న కర్నాటక సంగీతాన్ని సంగీత నీరాజనం ద్వారా తెలుగు వారికి చాటి చెప్పెందుకు సంగీత ఉత్సవాలను పండుగ వాతావరణంలో నిర్వహించనున్నామన్నారు. విజయవాడలో డిసెంబర్ 10వ తేది నుండి మూడు రోజుల పాటు నిర్వహించే కృష్ణవేణి సంగీత నీరాజనం కార్యక్రమంలో నిష్ణాతులైన సంగీత విద్వాంసులు కళాకారులచే కర్నాటక సంగీత కార్యక్రమాన్ని.. నిర్వహించడం జరుగుతుందన్నారు. కర్నాటక సంగీతానికి చెందిన దాదాపు 30 మంది గురువులు వారి శిష్య బృందం సంగీత ప్రదర్శన ద్వారా కనువిందు చేసేలా ఏర్పాటు చేయనున్నామన్నారు. తెలుగు జాతి సంస్కృతి సాంప్రదాయలను ప్రజలు చాటి చెప్పే విధంగా సంగీత వాయిద్య ప్రదర్శనలతో పాటు తెలుగు వారి వంటకాలతో ఫుడ్ కోర్టులను రాష్ట్రంలో పేరెన్నికగన్న కలంకారి, ఉప్పాడ, వెంటకగిరి, గద్వాల్, పోచనపల్లి, మంగళగిరి వంటి వస్త్రాప్రదర్శన ఏర్పాటు చేయనున్నామన్నారు. కృష్ణవేణి సంగీత నీరాజనం నిర్వహణకు తుమ్మలపల్లి కళాక్షేత్రం, బెరంపార్క్, దుర్గాఘాట్లు వేదికలు కానున్నాయన్నారు. విజయవాడ నగరంతో పాటు రాష్ట్రంలోని విజయనగరం, బొబ్బిలి, విశాఖపట్నం, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, ఒంగోలు, కర్నూలు నగరాలలో కృష్ణవేణి సంగీత నీరాజనం నిర్వహించనున్నట్లు ఆమె తెలిపారు. పండుగ వాతావరణంలో నిర్వహించే కృష్ణవేణి సంగీత నీరాజనం కార్యక్రమాన్ని ప్రజలకు చేరువ చేసేలా ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా, ఎఫ్ఎంరేడియో, ఆల్ఇండియా రేడియో, రైల్వేస్టేషన్లు ప్రసార మాధ్యమాల ద్వారా ముందుగా విస్తృత ప్రచారం చేయడంతో పాటు కార్యక్రమాన్ని ప్రత్యేక ప్రసారం చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి రజిత్ భార్గవ్ మాట్లాడుతూ తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కృష్ణవేణి సంగీత నీరాజనాన్ని విజయవాడతో పాటు రాష్ట్రంలోని ప్రధాన పట్టణాలలో నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడం అభినందనీయమన్నారు. 700 సీట్ల సామర్థ్యం గల తుమ్మలపల్లి కళాక్షేత్రం సంగీత నీరాజనం కార్యక్రమానికి అనువుగా ఉంటుందన్నారు. కృష్ణా నది తీరాన ఉన్న బెరంపార్కు, దుర్గాఘాట్ లో నిర్వహించే కార్యక్రమాలు కనువిందు చేస్తాయన్నారు. సంగీత నీరాజనానికి సంబంధించి రాష్ట్ర

ప్రభుత్వ పరంగా జిల్లా యంత్రాంగం ద్వారా పూర్తి సహాయ సహకారాలు అందించడం జరుగుతుందని రజిత్ బార్గవ్ తెలిపారు. కేంద్ర పర్యాటక శాఖ కార్యదర్శి వి. విద్యావతి ఇంద్రకీలాద్రి చేరుకుని కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శనం చేసుకున్నారు.అనంతరం సంగీత నీరాజనం నిర్వహించే తుమ్మలపల్లి కళాక్షేత్రం బెరంపార్కు, దుర్గఘాట్ పరిశీలించారు. సమావేశంలో పర్యాటక శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article