Sunday, April 20, 2025

Creating liberating content

తాజా వార్తలుక్యాన్స‌ర్‌తో క‌న్నుమూసిన బాలీవుడ్ న‌టి పూన‌మ్ పాండే

క్యాన్స‌ర్‌తో క‌న్నుమూసిన బాలీవుడ్ న‌టి పూన‌మ్ పాండే

ప్రముఖ మోడల్, సినీ నటి పూనమ్ పాండే మృతి చెందారు. ఈ ఉదయం పూనమ్ చనిపోయినట్టు ఆమె సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ఆమె టీమ్ ప్రకటించింది. ఆమె వయసు 32 ఏళ్లు. ‘ఈరోజు మాకు ఎంతో కఠినమైన రోజు. గర్భాశయ క్యాన్సర్ కారణంగా మేము ఎంతో అభిమానించే పూనమ్ పాండే చనిపోయారని చెప్పడానికి ఎంతో బాధపడుతున్నాం. ఆమెతో పరిచయం ఉన్న ప్రతి వ్యక్తి స్వచ్ఛమైన ప్రేమ, దయను పొందారు. ఈ బాధాకరమైన సమయంలో మేము గోప్యతను కోరుకుంటున్నాం’ అని పూనమ్ టీమ్ ఓ ప్రకటన ద్వారా తెలిపారు. పూనమ్ పాండే బాలీవుడ్, కన్నడతో పాటు తెలుగు సినిమాల్లో కూడా నటించారు. టీవీ షోలు కూడా చేశారు. శృంగార తారగా ఆమె ఇంటర్నెట్ ను షేక్ చేశారు. మరోవైపు, పూనమ్ పాండే చనిపోయారనే వార్తతో ఆమె అభిమానులు షాక్ కు గురవుతున్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article