ప్రిన్సిపాల్ డాక్టర్ చెరసాల యోగాంజనేయులు
వేంపల్లె
స్థానిక పట్టణంలోని వైయస్ మదీనాపురం కాలనీలో స్థానిక వైయస్సార్ వివేకానంద ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్.ఎస్.ఎస్. యూనిట్-1 ఆధ్వర్యంలో జరుగుతున్న ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరం ముగింపు కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా విచ్చేసిన ప్రిన్సిపల్ డాక్టర్ యోగాంజనేయులు మాట్లాడుతూ నాట్ మి బట్ యూ అన్న నానుడితో సాగుతున్న జాతీయ సేవా పథకంలో చేరి తోటి ప్రజల సహజీవనం, వారి ఆచార వ్యవహారాలను అధ్యయనం చేయుట మంచి పరిణామమని క్రమశిక్షణ నిబద్ధతతో ఉన్నత స్థానానికి చేరాలని అభినందించారు. తాళ్లపల్లె పిహెచ్సి హెల్త్ కోఆర్డినేటర్ బసవయ్య మాట్లాడుతూ బాల్య వివాహాల వల్ల కలిగే నష్టాలు, వాటి నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలు మీ మీద ఉన్నదని తెలియజేశారు. ఎంపిపియూపి స్కూల్ హెడ్ టీచర్ కరీముల్లా మాట్లాడుతూ ఈ వారం రోజులలో వాలంటీర్లు నిబద్ధత, క్రమశిక్షణతో పని చేశారని ఇది చాలా అభినందనీయమని ఇలాగే జీవితంలో ఉన్నత దశకు చేరుకొని అనేకులకు మార్గదర్శకులు కావాలని అభిలాషించారు. విద్యార్థిని విద్యార్థులు తమ అనుభవాలను పంచుకున్నారు. చక్కటి ప్రతిభ కనపరిచిన వాలంటీర్లకు బహుమతులు ప్రధానం చేశారు. విద్యార్థినీ, విద్యార్థులు నృత్య పోటీలలో పాల్గొన్నారు. ప్రత్యేక క్యాంపు సర్టిఫికెట్లు వాలంటీర్లకు ప్రిన్సిపల్ ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ ఓబుల్ రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ ఎస్ నాగేంద్ర, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, వైద్య సిబ్బంది, స్కూల్ టీచర్లు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు