పులివెందుల టౌన్
విద్యార్థిని విద్యార్థులకు క్రీడలతో మానసిక ఉల్లాసం చేకూరుతుందని ఎన్ఎస్ఎస్ యూనిట్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ నాగేంద్రమ్మ అన్నారు. మంగళవారం
ఎన్ఎస్ఎస్ స్పెషల్ క్యాంపులో భాగంగా ఆరవరోజు ఎన్ఎస్ఎస్ యూనిట్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్. వై . నాగేంద్రమ్మ ఆధ్వర్యంలో వైయస్ వి ఆర్ ఎం కళాశాల కాలేజ్ విద్యార్థినిలు , ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు దత్తత గ్రామమైన బ్రాహ్మణపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో విద్యార్థిని ,విద్యార్థులకు ఆరోగ్యకర మైన సలహాలను వివరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఐసీటీసీ కౌన్సిలర్ వెంకటసుబ్బయ్య, ఎస్ టి ఐ కౌన్సిలర్ బాదల్ వల్లి, స్నేహిత అమృత హస్తం సేవాసమితి అధ్యక్షులు రాజు లు హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులకు చదువుతోపాటు క్రీడలు ఎంతో ముఖ్యమని, క్రీడలతో మానసిక ఉల్లాసం కలుగుతుందన్నారు అలాగే పాఠశాల పరిసరాలు పరిశుభ్రం, వ్యక్తిగత పరిశుభ్రంతో అనారోగ్యం దరిచేరదన్నారు ఈ కార్యక్రమంలో విద్యార్థినీ విద్యార్థులు ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.