చక్రాయపేట
గండి శ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవస్ధానం నందు సోమవారం జరిగిన స్వామివారి హుండీల లెక్కింపులో 66 రోజులకు గాను 14,05,372 రూపాయలు, అన్నదానము హుండీ ద్వారా 14,753 రూపాయలు, 8 గ్రాముల 200 మి.గ్రా బంగారం, 520 గ్రాముల 340 మి.గ్రా వెండి వచ్చినట్లు ఆలయ అసిస్టెంట్ కమిషనర్ అలవలపాటి ముకుంద రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో చైర్మెన్ కావలి క్రిష్ణ తేజ, పాలక మండలి సభ్యులు, దేవదాయ శాఖ ఇన్స్పెక్టర్ జనార్దన్, ప్రధాన అర్చకులు కేసరి స్వామి, ఏపీజీబీ మేనేజర్ అశోక్ కుమార్, పోలీసు సిబ్బంది, కార్యాలయ సిబ్బంది మరియు కళ్యాణ కట్ట క్షురకులు పాల్గొన్నారు.