చంద్రగిరి:
సంక్షేమ పథకాలతో పేదల బ్రతుకులు మార్చుతున్న సంక్షేమ రథ సారథి జగనన్నకు జనం జేజేలు పలికారు. రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా అభివృద్ధి పనులను పూర్తి చేసి, కష్టంలో అండగా నిలిచిన ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కొనియాడారు.
చంద్రగిరి మండలం, కందుల వారి పల్లి పంచాయతీ పరిధిలో శనివారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి నిర్వహించారు. స్థానిక గ్రామ దేవతలకు పూజలు చేసి ప్రతి గడపలో సంక్షేమ పథకాలజాబితాను అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. సంక్షేమ పథకాలు, ఇంతకాలం జరిగిన అభివృద్ధి పనులు యదావిధిగా కొనసాగాలంటే మోహిత్ రెడ్డిని ఎమ్మెల్యేగా చేసుకుని జగనన్ననుముఖ్యమంత్రిగా చూడాలని అభ్యర్థించారు.
కరోనా సమయంలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేసిన మేలును స్థానిక ప్రజలకు గుర్తు చేశారు. కరోనా కష్టంలోనే కాదు, వరదలు వచ్చినప్పుడు కూడా ఎవ్వరికి ఏ అవసరం ఉన్నా ఆయనే ముందుకు వచ్చి సాయం చేశారని, అడగకనే అన్నీ ఇచ్చే నాయకుడు మాకు దొరకడం తమ అదృష్టమని ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో మోహిత్ రెడ్డిని తప్పకుండా గెలిపిస్తామనిమహిళలు
మాట ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వేణుగోపాల్ రెడ్డి, జడ్పిటిసి యుగంధర్ రెడ్డి, చంద్రగిరిమార్కెట్ యార్డ్ చైర్మన్ మరియు మండల అధ్యక్షులు కొట్టాల చంద్రశేఖర్ రెడ్డి, ఎస్. మస్తాన్, డివిజన్ అధ్యక్షులు కుప్పిరెడ్డి భాస్కర్ రెడ్డి, నాయకులు రాజయ్య స్థానిక ప్రజా ప్రతినిధులు, పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.