మార్కాపురం:మార్కాపురం వేసవి సెలవులను దృష్టిలో పెట్టుకుని గుంటూరు నుంచి గిద్దలూ రు మీదుగా తిరుపతి వెళ్ళే ఎక్స్ప్రెస్ రైలుకు అదనపు బోగీలను ఏర్పాటు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. గుంటూరు- గిద్దలూరు-తిరుపతి (17261) రైలుకు మే 17 నుంచి 31వ తేదీ వరకు, తిరుపతి-మార్కాపురం -గుంటూరు (17262) రైలుకు మే 17నుంచి జూన్ 1వ తేది వరకు 2 స్లీపర్ క్లాస్, 3 జనరల్ బోగీలను అదనంగా జతచేయడం జరుగుతుందని, ప్రయాణికులు వినియో గించుకోవాలని రైల్వే కమర్షియల్ ఆఫీసర్ లక్ష్మీనారాయణ తెలిపారు.