Friday, November 29, 2024

Creating liberating content

తాజా వార్తలుగోవాలో గోబి మంచూరియాపై నిషేధం..

గోవాలో గోబి మంచూరియాపై నిషేధం..

చాలా మంది ఫేవరెట్​ ఫుడ్​ అయిన గోబి మంచూరియాపై నిషేధం విధించింది గోవాలోని ఓ పట్టణం! రెస్టారెంట్లే కాదు.. రోడ్డు పక్కన కనిపించే ఫుడ్​ స్టాల్స్​లో కూడా ఈ స్టార్టర్​ డిష్​ని అమ్మకూడదని తేల్చేసింది. గోవాలోని మపుసాలో గోబి మంచూరియాను అక్కడి అధికార యంత్రాంగం నిషేధించింది. గోబి మంచూరియా తయారీలో సింథెటిక్​ కలర్స్​ వాడుతున్నారన్న కారణంతోనే దానిపై నిషేధం విధించింది మపుసా మున్సిపల్​ కౌన్సిల్​. అయితే.. గోవాలో ఈ స్టార్టర్​ డిష్​ని నిషేధించడం ఇది తొలిసారి కాదు! 2022లో జరిగిన వాస్కో సప్తా ఫెయిర్​ సమయంలోనూ ఇది నిషేధానికి గురైంది. అప్పుడు.. స్వయంగా, ఎఫ్​డీఏ (ఫుడ్​ అండ్​ డ్రగ్స్​ అడ్మినిస్ట్రేషన్​) నిషేధం విధించాలని సూచించింది. తాము ఇచ్చిన ఆదేశాలను అమలు చేస్తున్నారా? లేదా? అని తెలుసుకునేందుకు..ఎఫ్​డీఏ రైడ్లు కూడా నిర్వహించింది ! ముంబైకి చెందిన దిగ్గజ చైనీస్​ రెస్టారెంట్​ నెల్సన్​ వాంగ్​.. దీనిని రూపొందించి, క్రికెట్​ క్లబ్​ ఆఫ్​ ఇండియాకు సర్వ్​ చేసింది. ఏదైనా కొత్త డిష్​ని తయారు చేయాలని ఛాలెంజ్​గా తీసుకున్నారు నెల్సన్​ వంగ్​. స్పైసీ కార్న్​ఫ్లోర్​ బాటర్​లో చికెన్​ నగ్గెట్స్​ని డీప్​ ఫ్రె చేసి.. డ్రైగా లేదా సోయా సాస్​, వెనిగర్​, షుగర్​తో తయారు చేసిన ట్యాంగీ గ్రేవీతో సర్వ్​ చేశారు. అది బంపర్​ హిట్​ కొట్టింది. అది నాన్​ వెజ్​ ఫుడ్​. వెజిటేరియన్స్​కి కూడా అలాంటి రకమే ఒకటి ఉంటుందని భావించారు. అలా పుట్టుకొచ్చిందే ఈ గోబి మంచూరియా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article