గ్రామాల అభివృద్ధి తెదేపాతోనే సాధ్యం
- వరిమడుగులో ప్రచారం నిర్వహించిన తెదేపా నాయకులు రాప్తాడు ;గ్రామాల అభివృద్ధి తెదేపాతోనే సాధ్యం అని పరిటాల సునీతను అఖండ మెజారిటీతో గెలిపిద్దాం,
- చంద్రబాబు తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసి రాష్ట్ర భవిష్యత్తును కాపాడదామని మాజీ మంత్రి పరిటాల సునీత సోదరుడు మండల తెదేపా ఇన్చార్జ్ ధర్మవరపు మురళి ప్రజలను కోరారు . సోమవారం మండల పరిధిలోని వరిమడుగు గ్రామంలో బాబుతో భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమాన్ని తెదేపా నాయకులు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఇంటింటికి తిరిగి తెదేపా ,జనసేన మేనిఫెస్టోని సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు . వైకాపా ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించారు నియోజకవర్గంలో పరిటాల సునీతను అఖండ మెజారిటీతో గెలిపించాలని నియోజకవర్గ అభివృద్ధికి ప్రజల సహకరించాలని తెదేపా అధికారంలో ఉంటేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని ప్రజలకు సూచించారు ఎమ్మెల్యే సోదరులు ధనార్జన ధ్యేయంగా నియోజకవర్గాన్ని దోచుకున్నారని మళ్లీ వైకాపా అధికారంలోకి వస్తే నియోజకవర్గం అతలాకుతలమవుతుందని పేర్కొన్నారు సైకిల్ గుర్తుకు ప్రతి ఒక్కరు ఓటు వేసి తెదేపా పార్టీని అధికారులు తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు . ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ పంపు కొండప్ప ప్రధాన కార్యదర్శి దగ్గుపాటి శ్రీనివాసులు , మరోరు గోపాల్ ,గంగలకుంట రమణ ,గుజ్జల నారాయణస్వామి ,సర్పంచ్ సాకే తిరుపాల్ , ఇంద్రశేఖర్ , సాకే నారాయణస్వామి, గంగలకుంట కిష్ట , ఎంపీటీసీ రవి,మోహన్ రెడ్డి , సాకే జయరాములు,అంపాపురం జయప్ప , డిష్ వెంకటరాముడు , కొత్తపల్లి c నారాయణస్వామి , ముత్యాలు,మరూరు కదిరప్ప , మరూరు నరేష్, పామెల్ల కొండప్ప, ఉప్పర శ్రీనివాసులు, జూటూరు రామకృష్ణ , నరసింహులు , పుల్లలరేవు ప్రసాద్ గవ్వల మహేష్, రాజేంద్ర నాయుడు , స్వర్ణక్క , కొత్తపల్లి నారాయణస్వామి,తదితర తెదేపా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు .