రాప్తాడు ;
గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా ప్రోగ్రాం అధికారి సుజాత, డిపిఎమ్ఓ డాక్టర్ రవిశంకర్ పేర్కొన్నారు. శుక్రవారం మండల పరిధిలోని మరూరు గ్రామంలో వైద్యాధికారి శివకృష్ణ ఆధ్వర్యంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని
ప్రోగ్రాం అధికారి సుజాత, డిపిఎమ్ఓ డాక్టర్ రవిశంకర్ పరిశీలించారు ఎంత మందికి పరీక్ష నిర్వహించారు మందులు పంపిణీ చేశారని వైద్య అధికారులు అడుగు తెలుసుకున్నారు అదేవిధంగా ల్యాబ్ రిపోర్ట్స్, కంటి పరీక్షలు తదితర అంశాలపై ఆరా తీశారు ఈ సందర్భంగా రోగులతో మాట్లాడి ప్రభుత్వ వైద్యశాల లోనే చికిత్సలు చేయించుకోవాలని ప్రజలకు సూచించారు ఈ కార్యక్రమంలో సిహెచ్ శివప్రసాద్ సూపర్వైజర్ నరసింహ,మూర్తి ఏఎన్ఎం, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు