టి.నరసాపురం
స్థానిక శ్రీ అన్నపూర్ణ విశాలాక్షి సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయం వద్దనుండి జగన్నాథ స్వామి వారి రథోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు దేవాదాయ ధర్మాదాయ శాఖ నిర్వహణలో ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ధర్మ ప్రచార మహోత్సవాల్లో భాగంగా దక్షిణ పూరి క్షేత్రంగా పేరుగాంచిన ఏలూరు జిల్లా ముదినేపల్లి మండలంలోని వడాలి గ్రామంలో వేంచేసిన శ్రీ సుభద్ర బలరామ సమేత శ్రీ జగన్నాథ స్వామి వారి ఉత్సవమూర్తులకు రథోత్సవ కార్యక్రమం నిర్వహించారు ముందుగా జగన్నాథ స్వామి వారి ఉత్సవమూర్తులను ఆలయంలో పూజలు నిర్వహించి ఆలయంలో గల రథంలో ఉత్సవమూర్తులను ఉంచి గ్రామంలో రథోత్సవం నిర్వహించారు ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పురవీధులలో రథం లాగుతూ శివనామస్మరణతో రథోత్సవం నిర్వహించారు అనంతరం ఆలయం వద్ద భక్తులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం జరిపారు ఈ సందర్భంగా ఈవో సింగనపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా జగన్నాథ స్వామి వారి విగ్రహమూర్తులను గ్రామంలో రథోత్సవం నిర్వహించినట్లు ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనటం ఆనందదాయకమన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ కమ్మెల రమేష్ రాజు ఉత్సవ కమిటీ పర్వతనేని మురళి పసుమర్తి రాము లింగారెడ్డి శ్రీనివాస్ నల్లూరి శ్రీనివాస్ ముల్లపూడి సుబ్బారావు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు