Monday, April 21, 2025

Creating liberating content

తాజా వార్తలుఘనంగా బల్లల పండుగ

ఘనంగా బల్లల పండుగ

ఏలేశ్వరం:-
పట్టణంలో 14వ వార్డులో రజకులు నిర్వహించే బల్లల పండుగ ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ప్రత్తిపాడు నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వరుపుల సుబ్బారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా వరుపుల మాట్లాడుతూ, ప్రతి ఏటా సంక్రాంతి పండుగ తర్వాత రజకులు జరుపుకునే ఈ బల్లల పండుగ విశిష్టత తో కూడి ఉంటుందని, ఈ బల్లల పండుగకు హాజరవడం తన అదృష్టంగా భావిస్తున్నాను అని అన్నారు. ఈ పండుగ సందర్భంగా రజకులంతా వీరభద్రుని ఊరంతా ఊరేగిస్తూ సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో చైర్ పర్సన్ అలమండ సత్యవతి చలమయ్య, వైస్ చైర్ పర్సన్ శిడగం త్రివేణి వెంకటేశ్వరరావు, తొండారపు రాంబాబు, సామంతుల కుమార్, పైల విజయ్ కుమార్, వాగు బలరాం, రజక సంఘ పెద్దలు, రజకులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article