వి.ఆర్.పురం :భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శనివారం మండల అధ్యక్షులు ముత్యాల రాంబాబు ఇంటి వద్ద బిజెపి జనసేన నాయకులు పాల్గొని కేక్ కట్ చేసి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి పాయం వెంకయ్య మాట్లాడుతూ ఈరోజు దేశంలోని అతిపెద్ద పార్టీ బిజెపి అని, ప్రపంచంలోనే మోడీకి కీర్తి ప్రతిష్టలు పెరిగాయని, దేశంలోనే యువత రైతు మహిళ కార్మికులు బిజెపి వైపు చూసి మోడీ నాయకత్వంలో పది సంవత్సరములుగా అవినీతి మచ్చలేని పరిపాలన అందించారని అన్నారు. రాబోయే ఐదు సంవత్సరాలు కూడా ఎన్డీఏ కూటమి 400 సీట్లతో మూడోసారి ఘన విజయం సాధిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు ముత్యాల రాంబాబు, జనసేన పార్టీ మండల అధ్యక్షులు ములకాల సాయికృష్ణ, బీజేపీ అరకు పార్లమెంట్ సోషల్ మీడియా మెంబర్ కడుపు రాజు, జనసేన పార్టీ మండల ప్రధాన కార్యదర్శి కోట్ల రామ్మోహన్ రెడ్డి, బిజెపి మండల ప్రధాన కార్యదర్శి ఊయికా రత్తయ్య, జనసేన మండల కార్యదర్శి బాగుల అంజనరావు, బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు మడకం జానయ్య, మండల గిరిజన మోర్చా అధ్యక్షులు సొంది నాగేశ్వరరావు, కారం జయరాజు తదితరులు పాల్గొన్నారు.
