తిరుపతి :సహకారంతో అందరికీ సమృద్ది “నినాదంతో 102వ అంతర్జాతీయ సహకార దినోత్సవం జిల్లా సహకార బ్యాంక్ తిరుపతి శాఖ నందు జిల్లా సహకార అధికారిని శ్రీమతి S . లక్ష్మీ అధ్యక్షతన ఘనంగా జరిగింది. సహకార జెండాను ఆవిష్కరించిన పిదప సమావేశంలో మాట్లాడుతూ సహకార గళంగా భావించే “అంతర్జాతీయ సహకార కూటమి “( ఐ సి ఏ)పిలుపు మేరకు సహకార ఉద్యమ బలోపేతానికి ఈ దినోత్సవం ప్రపంచమంతా ప్రతి సంవత్సరము జూలై 6 న జరుపుకుంటారని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మద్దిపట్ల వెంకటరమణ మాట్లాడుతూ పెట్టుబడీ దారి , సామ్యవాద ఆర్థిక వ్యవస్థలు ప్రపంచంలో అనుకున్న లక్ష్యాలను చేర లేకపోయాయని అందువల్ల సహకార ఆర్థిక వ్యస్థతో సర్వతోముఖాభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా సహకార బ్యాంక్ ప్రత్యెక అధికారిని అయిన నారాయణమ్మ గారు , సుధాకర్,బ్యాంక్ అధికారులు మరియు సహకార సిబ్బంది పాల్గొన్నారు.