Saturday, November 30, 2024

Creating liberating content

తాజా వార్తలుచంద్రబాబుకు పక్క పార్టీలు, పక్క రాష్ట్రంలో కూడా స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారు

చంద్రబాబుకు పక్క పార్టీలు, పక్క రాష్ట్రంలో కూడా స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారు

ఏపీని చీల్చిన పార్టీలో చంద్రబాబుకు స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారని విమర్శలు చేశారు సీఎం జగన్. ఏపీని ఎలాంటి అభివృద్ధి చేయని చంద్రబాబుకు స్టార్ క్యాంపెయినర్లు ఎక్కువగా ఉన్నారని .. మోసాలు చేయడమే చంద్రబాబు చరిత్ర అంటూ విమర్శించారు. పక్క రాష్ట్రంలో ఉండే దత్తపుత్రుడు చంద్రబాబు స్టార్ క్యాంపెయినర్ అంటూ పవన్‌కల్యాన్‌పై పరోక్ష విమర్శలు గుప్పించారు. చంద్రబాబు స్టార్ క్యాంపెయినర్ల కొందరు బీజేపీలో తలదాచుకున్నారని.. మోసాలు, కుట్రలు, కుతంత్రలు చేయడమే వారి అజెండా అంటూ ఆరోపించారు.
పసుపు కమలాల మనుషులు బాబుకు స్టార్‌ క్యాంపెయినర్‌లు ఉన్నారు. ఇంకా స్టార్‌ క్యాంపెయినర్‌లు చాలామందే ఉన్నారు. అమరావతిలో బాబు బినామీలు ఉన్నట్లే.. ఇతర పార్టీల్లో చంద్రబాబు బినామీలు స్టార్‌ క్యాంపెయినర్‌లు ఉన్నారు. కొందరు టీవీల్లో విశ్లేషకులు, మేధావుల పేరిట టీవీల్లో కూడా కనిపిస్తారని సీఎం జగన్ విమర్శించారు. చెడు మాత్రమే చేసిన చరిత్ర ఉన్న చంద్రబాబు నాయుడికి గజ దొంగల ముఠా ఉంది. ఆయనకు మంచి చేసిన ఘనతే లేదు. పాలనతో మోసం చేసిన ఘనతే ఉందని విమర్శించారు. ఏం చేయని ఆయనకు ఇంత మంది స్టార్‌ క్యాంపెయినర్‌లు ఉన్నారు.రాష్ట్రాన్ని చీల్చిన కాంగ్రెస్ పార్టీలోనూ కొత్తగా కొందరు స్టార్ క్యాంపెయినర్లు చంద్రబాబు కోసం చేరారని ఆరోపించారు. బాబును భుజాన మోసే ముఠా చాలామందే ఉన్నారని మండిపడ్డారు. తనకు అలాంటి వారు ఎవరూ లేరన్నారు.
అందరూ ఈ తేడాను గమనించాలి: జగన్
టీడీపీ హయాంలో జన్మభూమి కమిటీ స్థాయి నుంచి సీఎం స్థాయి వరకు లంచాలిస్తేనే పనులు జరిగేవని ముఖ్యమంత్రి జగన్ విమర్శించారు. ఇప్పుడు అర్హులైన ప్రతి ఒక్కరికీ పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందుతున్నాయని చెప్పారు. వైసీపీ పాలనలో అక్కాచెల్లెమ్మల ముఖంలో చిరునవ్వులు కనిపిస్తున్నాయని అన్నారు. గత ప్రభుత్వంలో ఈ మంచి ఎందుకు జరగలేదని అందరూ ఆలోచించాలని సూచించారు. గతంలో దోచుకో, పంచుకో అన్నట్టుగా ఉండేదని… ఇప్పుడు మీ బిడ్డ బటన్ నొక్కితే, నేరుగా మీ ఖాతాల్లోకి డబ్బు జమ అవుతోందని.. ఈ తేడాను గమనించాలని కోరారు.
పొదుపు సంఘాల రుణమాఫీ చేస్తానని మేనిఫెస్టోలో చంద్రబాబు హామీ ఇచ్చారని.. ఎన్నికలయ్యాక మేనిఫెస్టో చెత్త బుట్టలో పడేశాడు. అక్కాచెల్లెమ్మలకు ఇచ్చిన ఆ మాట గాలి కొదిలేశాడు. అక్టోబర్‌ 2016 నుంచి ఆ అక్కాచెల్లెమ్మలకు సున్నా వడ్డీ పథకం రద్దు చేశాడు. అప్పట్లో.. పొదుపు సంఘాల రుణాలు కాస్త.. తడిసి మొపెడు అయ్యి వడ్డీలు, చక్రవడ్డీలు కట్టుకునే పరిస్థితికి వచ్చింది. పొదుపు సంఘాల అక్కాచెల్లెమ్మలు ఒక్క మోసంతో చంద్రబాబు నాయుడిగారి ఆటతో నష్టం జరిగిందని.. దెబ్బ పడింది అనడానికి ఇదే ఉదాహరణ. చంద్రబాబు మోసానికి ఏ గ్రేడ్‌, బీ గ్రేడ్‌ సంఘాలు కూడా కిందకు పడిపోయాయన్నారు.
గతంలో జన్మభూమి కమిటీ స్థాయి నుంచి సీఎం స్థాయి దాకా లంచాలిస్తేనే పనులు జరిగేవని.. ఇప్పుడు పాదర్శకంగా సంక్షేమం అర్హులకు అందుతోందని జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. గతంలో కూడా ఓ పాలన ఉండేది. అప్పుడు కూడా ఒకే రాష్ట్రం.. ఇదే రాష్ట్రం. ఇదే బడ్జెట్‌. మారిందల్లా కేవలం ముఖ్యమంత్రే. మిగిలినవి మామూలే. అప్పుల గ్రోత్‌ రేటు కూడా తక్కువే. మీ బిడ్డ ప్రభుత్వంలో అక్కచెల్లెమ్మమ ముఖంలో చిరునవ్వులు కనిపిస్తున్నాయన్నారు. గతంలో దోచుకో పంచుకో తినుకో ఉండేది. ఇప్పుడు మీ బిడ్డ బటన్‌ నొక్కుతున్నాడు.. నేరుగా మీ ఖాతాల్లోనే డబ్బు జమ అవుతోంది. తేడా గమనించమని కోరుతున్నానన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article