జిల్లా ప్రధాన కార్యదర్శి బుచ్చిబాబు
కామవరపుకోట
ఆంధ్ర ప్రదేశ్ మధ్యాహ్న భోజనం పథకంలో పనిచేస్తున్న కార్మికులకల
తమ న్యాయమైన డిమాండ్స్ సాధన కోసం ఈ నెల 8వ తేదీన తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఎఐటియుసి ఏలూరు జిల్లా ప్రధాన కార్యదర్శి కంకిపాడు బుచ్చిబాబు కోరారు. గత 20 సంవత్సరాలుగా గ్రామీణ ప్రాంతాల్లో గల ఉన్న పేద విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వ స్కీములో భాగంగా మధ్యాహ్నం భోజనం వండి వారీచి పాఠశాలలో గల బాల బాలికలకు గోరుముద్దలు తినిపించి అమ్మలా ఆదరించే మధ్యాహ్న భోజన కార్మికులను ఆదుకోవాలని కోరుతూ ముద్రించిన కరపత్రాన్ని మధ్యాహ్న భోజన కార్మికులు సమక్షంలో ఏఐటీయూసీ నాయకులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చింతలపూడి ఏరియా గౌరవాధ్యక్షులు టీవీఎస్ రాజు మాట్లాడుతూ పాఠశాలలో ఉన్న బాల బాలికలను ఆదరించి అభిమానించి గోరుముద్దలు తినిపించి పౌష్టిక ఆహారాన్ని అందిస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులు బడి పిల్లలను కన్నతల్లి కంటే నిన్నటి ఆదరిస్తుంటే, వారికీ అవసరమైన ప్రభుత్వ రాయితీలు అమలు చేయడంలో జగన్ రెడ్డి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాల పేరుతో వేల కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసి రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీస్తున్నానా జగన్ రెడ్డి, ఆడపడుచులైన మధ్యాహ్న భోజన మహిళ కార్మికులకు తగిన న్యాయం చేయకపోతే రాబోయే కాలంలో మధ్యాహ్న భోజన కార్మికులైన మహిళా శక్తి ఐక్యమై జగన్ రెడ్డిని ఇంటికి సాగనంపుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వాన రాసి సుశీల, ఎస్కే వసుధ కృష్ణవేణి దుర్గా సుబ్బలక్ష్మి కంకిపాటి కుమారి తదితరులు పాల్గొన్నారు.