జగ్గంపేట
ముఖ్యమంత్రి జగనన్న ప్రభుత్వం అందిస్తున్న సుపరిపాలనకు రధసారథులు వాలంటీర్లు అని కాకినాడ జిల్లా జె సి యస్ కో ఆర్డినేటర్,వై యస్ ఆర్ సేవాదళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,రామచంద్రాపురం పార్టీ పరిశీలకులు ఒమ్మి రఘురామ్ అన్నారు. ఈరోజు జగ్గంపేట మండలం, కాండ్రేగుల మరియు గుర్రంపాలెం గ్రామ సచివాలయాలలో సచివాలయ కార్యదర్సులు షేక్ షకీలా, తోట దేవి ల అధ్యక్షతన జరిగిన వాలంటీర్ల కు అవార్డులు పంపిణీ కార్యక్రమాలకు ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రఘురామ్ మాట్లాడుతూ ప్రతి వాలంటీర్ ద్వారా జగనన్న ప్రభుత్వంలో కోటి నుండి కోటీ ఇరవై లక్షల రూపాయలు వారి 50 నుండి 70 కుటుంబాలకు లబ్ది చేకూర్చాలని తెలియజేసారు. రాష్ట్రంలో జరిగే అవినీతిరహిత, పారదర్శకపాలనకు వాలంటీర్లే పాత్రధారులు అన్నారు. ఈరోజు వాలంటీర్ల కు ఉన్న గౌరవం నాయకులకు కూడా లేదన్నారు. మీరు మరింత ఉత్సాహంగా పనిచేసి పేదలకు మేలు చేయడానికే ఈ సేవా వజ్ర, సేవా మిత్ర, సేవా రత్న అవార్డులు జగనన్న ఇస్తున్నారని అన్నారు. కాండ్రేగుల లో 16 మందికి గుర్రంపాలెం సచివాలయ పరిధిలో 21 మందికి ఈరోజు సన్మానాలు చేసి సర్టిఫికెట్ లు, బ్యాడ్జులు అందించారు. ఈ కార్యక్రమంలో కాండ్రేగుల సర్పంచ్ బొదిరెడ్డి చక్రరావు, గుర్రంపాలెం సర్పంచ్ చీపురుపల్లి లక్ష్మీ రాఘన, వైస్ ఎంపీపీ నక్కా శ్రీను, వరుపుల సూరిబాబు, అబిరెడ్డి వీరబాబు,పడాల రాజశేఖర్,పలువురు సచివాలయ కన్వీనర్లు,గృహ సారథులు, పార్టీ నాయకులు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.