తుని
రామకృష్ణ కాలనీ సకల సదుపాయాల సోయగం. తుని నియోజకవర్గంలో దాదాపు 50 వేల కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేసిన ప్రజా నేత యనమల రామకృష్ణుడు. అందులో భాగంగానే తుని మండలం ఎస్ అన్నవరం పంచాయతీకి చెందిన నిరుపేదల కోసం జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న ప్రదేశంలో భూసేకరణ చేసి మరి కొంతమందికి ఆవాసం కల్పించారు. పక్కా గృహ నిర్మాణం ద్వారా ఆ గ్రామ నిరుపేదలు సొంత ఇంట్లో దర్జాగా జీవనం సాగిస్తున్నారు. ఆనాడు అబ్బో అక్కడ ఎందుకు ఇళ్లు అని ఎగతాళి చేసిన వారు ఈనాడు రామకృష్ణ కాలనీ చూసి అధరహో అంటున్నారు. జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న ఈ కాలనీ ఇప్పుడు టౌన్ షిఫ్ గా అన్ని సొగసులు అద్దుకుంది. అన్ని మౌలిక సదుపాయాలు కల్పించడంతో ఇప్పుడు రామకృష్ణ కాలనీ పరిసల ప్రాంతాల్లో గజం జాగా కూడా దొరకడం లేదు. అందుచేతనే తమ సొంతింటి కలను సాకారం చేసిన ప్రజాభ్యధయనేత యనమల రామకృష్ణుడి తనయురాలు దివ్యమ్మకు అఖండ మెజార్టీ అందించి రుణం తీర్చుకుంటామని కాలనీవాసులు అంటున్నారు. మండల టిడిపి అధ్యక్షుడు అప్పన రమేష్ ఆధ్వర్యంలో జరిగిన మీ ఇంటికి మీ దివ్య కార్యక్రమం జన ప్రభంజనంతో సాగింది.
మీ ఇంటికి మీ దివ్య తుని మండలం S అన్నవరం గ్రామం రామకృష్ణ కాలనీ లో మీ ఇంటికి మీ దివ్య కార్యక్రమం జరిగింది
మీ ఇంటికి మీ దివ్య కార్యక్రమంలో భాగంగా ఇంటి ఇంటికి వెళ్లిన యనమల దివ్య కు మహిళలు మంగళ హారతులతో ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా దివ్య మాట్లాడుతూ తన తండ్రి హయాంలో నిర్మితమైన రామకృష్ణ కాలనీ తలమానికమన్నారు.మరో రెండు నెలలలో తెలుగుదేశం ప్రభుత్వం వస్తుందని ఇళ్ళు లేని వాళ్లు అందరికీ కాలనీలు కట్టి ఇస్తామన్నారు.సైకో పాలనను తరిమికొట్టి సైకిల్ పాలనకు పట్టంకట్టాలని దీనికి ప్రజలందరూ సహకరించాలని ఆమె కోరారు
ఈ కార్యక్రమంలో యనమల శివరామ కృష్ణన్, పోల్నాటి శేషగిరి, మోత్కూరి వెంకటేష్, అప్పన రమేష్, జనసేన సమన్వయ కర్త చోడిశేట్టి గణేష్, సుర్ల లోవరాజు, వంగలపూడి శ్రీనివాసరావు, చింతంనీడి విజయ్, పోలిశెట్టి రామలింగేశ్వరరావు, పోలిశెట్టి దారబాబు,చింతంనీడి అబ్బాయి, గాది వరహాలు బాబు, వంగలపూడి బుజ్జీ, అంకంరెడ్డి నాన అబ్బాయి, మళ్ళ గణేష్, అల్లు రాజు,స్థానిక నాయకులు, నంబారు వెంకన్న, కందుకూరి సూరిబాబు, గానుగుల సతీష్, నరలాశెట్టి రాజు, గాణుగుల కామేశ్వరరావు, పూడి శ్రీను,నవీన్ రాజా, సానా సూరి, బద్ది త్రిమూర్తులు,మరియు తెలుగుదేశం జనసేన నాయకులు కార్యక్తలు పాల్గొన్నారు