జిల్లా కలెక్టర్ కె యేట్రి సెల్వి
ఏలూరు :జర్నలిస్టుల సమస్యలు ఏవైనా సరే తను దృష్టికి తీసుకొస్తే ప్రథమ ప్రాధాన్యత వెంటనే వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తానని జిల్లా కలెక్టర్ కే వెట్రి సెల్వి తెలిపారు. ఏలూరు నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని కలెక్టర్ ఛాంబర్ నందు ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు కలెక్టరేట్ర సెల్వినీ మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందించారు . ఏలూరు జిల్లాకు సేవలందించేందుకు వచ్చినందుకు కలెక్టర్కు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం రాష్ట్ర నాయకులు జర్నలిస్టుల సమస్యలపై కలెక్టర్ తో మాట్లాడారు. జర్నలిస్టుల పిల్లలు 2024 25 విద్య సంవత్సరానికి గాను జర్నలిస్టుల పిల్లల పాఠశాల ఫీజూల్లో 50% రాయితీ కల్పించాలని కోరారు. దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్ ఈ విషయంపై రాష్ట్ర విద్యాశాఖ కార్యాలయంలో కూడా వివరాలు అడిగి తెలుసుకుని వారి ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే జర్నలిస్ట్ సమస్యలు ఏమైనా సరే నా దృష్టికి తీసుకువస్తే వెంటనే వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తానని కూడా ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులతో పటు
అనుబంధ ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా నాయకులు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.