హిందూపురం టౌన్
ఇటీవల జాతీయ స్థాయిలో నేషనల్ ఇండిపెండెంట్ స్కూల్ అబియాన్స్ ఇండియా (ఎన్ ఐ ఎస్ ఏ) జాతీయస్థాయిులో 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఎన్ ఏ ఏ టి-2023 పరీక్షలను నిర్వహించగా ఈ పరీక్షల్లో స్థానిక పాంచజన్య పాఠశాలకు చెందిన 4వ తరగతి విద్యార్థి ముస్తఫా జాతీయస్థాయిలో ప్రధను ర్యాంకు, ద్వితీయ ర్యాంకు రిధా ఫాతిమా లు సాధించారు. వీరికి ఢిల్లీలోని హయాత్ హెూటల్ లో పద్మశ్రీ డాక్టర్ జిలేందర్ సింగ్, ఎన్ఐఎస్ఎ అధ్యక్షులు కుల భూషణ్ శర్మలు బహుమతులతో పాటు ప్రశంస పత్రాలు అందించారు. ఈ సందర్భంగా పాంచజన్య పాఠశాల వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీనివాసులు గురువారం వివరాలను వెల్లడించారు. పాఠశాల విద్యార్థులు జాతీయ స్థాయి లో ప్రథమ, ద్వితీయ బహుమతులు అందుకోవడం సంతోషంగా ఉందన్నారు. త్వరలో ముస్తఫా లండన్ లో కేంబ్రిడ్జ్ విశ్వ విద్యాలయంలో బహుమతిని అందుకోనున్నట్లు తెలిపారు. జాతీయ స్థాయిలో బహుమతులు అందుకున్న విద్యార్థులను పాఠశాల అడ్మినిస్ట్రేటివ్ డైరెక్టర్లు స్మిత, నందిత, హెచ్ఎం గాయత్రి, ఏఓ భాస్కర్, సూపరింటెండెంట్ విజయేంద్ర, ఏ హెచ్ ఎం లు శశికళ, సతీష్ కుమార్, షేక్ అబ్దుల్ రజాక్ తదితరులు అభినందించారు.