కడప సిటీ:
కడప జిల్లాలో ఆదివారం ఫిబ్రవరి 4 నాడు దళిత హక్కుల పోరాట సమితి 2024 రాష్ట్ర డైరీ ని సిపిఐ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ గాలి చంద్ర ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కామ్రేడ్ గాలి చంద్ర మాట్లాడుతూ దళితుల హక్కుల కోసం పోరాడటం అంటే ఎంతో సాహసోపేతమైన కార్యక్రమమని, అటువంటి డైరీ ని ఆవిష్కరిస్తున్నందుకు మాకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఆనాడు రాజ్యాంగంలో అంబేద్కర్ దళితుల కొరకు పొందుపరచిన చట్టాలను అమలు చేయవలసిన బాధ్యత కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు, చట్టసభలు మీద,పోలీసులు న్యాయ వ్యవస్థ మీద ఉందని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దళిత మైనార్టీ వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ బిజెపి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దాడులు పెరిగిపోయాయి, మతం ప్రాతిపదికన మెజార్టీలను సంతృప్తి చెందిచడానికి అన్నదమ్ముల్లా కలిసి ఉన్న భారత దేశ ప్రజలను విడదీస్తూ పరిపాలన సాగించడం సిగ్గుచేటు అన్నారు, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కలలుగన్న భారతదేశం కాకుండా నేడు పూర్తిగా మనువాదుల చేతులలోకి వెళ్లిందన్నారు, అంబేద్కర్ మనుధర్మ శాస్త్ర ప్రతులను దగ్ధం చేయండి అని పిలుపునిస్తే నేడు మనువాదులే రాజ్యమేలే పరిస్థితికి వచ్చిందన్నారు, తద్వారా దేశంలో దళితుల పైన దాడులు కుల వివక్షత పెరిగిపోయాయి అన్నారు, ఇటువంటి మను వాదానికి మద్దతు ఇస్తున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా దళితులపై దాడులు హత్యలు, హత్యాచారాలు జరుగుతున్న పట్టించుకోకుండా యదేచ్చగా బిజెపికి మద్దతిస్తూ దళితులను కేవలం ఓటు బ్యాంకుగా వాడుకుంటుందన్నారు, దళితుల చేతుల్లో ఉన్న భూములను భూ హక్కు చట్టం ద్వారా మార్పులు చేసి అగ్రవర్ణాలకు చెందే విధంగా దళితులకు ద్రోహం చేసిందన్నారు, రాష్ట్రంలో అమలవుతున్న 27 సంక్షేమ పథకాలను రద్దు చేసి నవరత్నాలు చూపెడుతూ మోసం చేస్తుందన్నారు, ఈ విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆశయాలకు వ్యతిరేకంగా పరిపాలన చేస్తూ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతూ , వందల వేల అడుగులలో అడుగులో విగ్రహాలు పెట్టడం ద్వారా దళితులకు ఏమి మేలు జరగదు అన్నారు, ఇందులో సామాజికంగా హార్దికంగా సమానత్వం వచ్చినప్పుడే కుల వ్యవస్థ పూర్తిగా అంతమైనప్పుడే దళితుల అభివృద్ధి చెందుతారు, ఈ ప్రభుత్వాలు అప్పుడే అంబేద్కర్ కు నిజమైన నివాళిగా ఉంటుంది కానీ ఆయన ఫోటో విగ్రహాలను చూపించి దళితులను మోసం చేయడం మానుకోవాలన్నారు, దళితులు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలను నిశితంగా విశ్లేషించుకుని చైతన్యవంతంగా మారాల్సిన అవసరం ఉందన్నారు, దళిత హక్కులపోరాట సమితి దళితులను పేదలను చైతన్యం చేసి , పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు, కేవలం దళితుల సమస్యల కొరకే కాక సమాజంలో ఉండే అన్ని వర్గాలు, కులాల వారి సమస్యల కొరకు, పోరాటాలు చేయడం, సేవా కార్యక్రమాలు ద్వారా దళిత ప్రజలకు మరింత న్యాయం జరిగే అవకాశం ఉందని అన్నారు.ఈ కార్యక్రమంలో ఏఐటియుసిజిల్లా నాయకులు కే.సి.బాదుల్లా ,డి డిహెచ్పిఎస్ కడప జిల్లా కార్యదర్శి కా నగల మునెయ్య నగర అధ్యక్షుడు గోవిందు మున్సిపల్ యూనియన్ నాయకులు తారక రామారావు, నరసింహులు, రాజశేఖర్, ఈశ్వరయ్య, జాన్, వెంకటాద్రి, బాబు, విజయ్ లు పాల్గొన్నారు.