ఢిల్లీలో మంగళవారం లష్కరే తోయిబా ఉగ్రవాదిని భద్రతాబలగాలు అరెస్ట్ చేశాయి. లష్కరే తోయిబా క్రియాశీల సభ్యుడిగా ఉన్న రియాజ్ అహ్మద్ రాథర్ అనే వ్యక్తిని ఢిల్లీ రైల్వే స్టేషన్ లో అదుపులోకి తీసుకున్నారు. లష్కరే తోయిబా ఉగ్రవాది, రిటైర్డ్ ఆర్మీ జవాను అయిన రియాజ్ అహ్మద్ రాథర్ ను పోలీసులు ఢిల్లీలో అదుపులోకి తీసుకున్నారు. కశ్మీర్ లోని కుప్వారా రియాజ్ అహ్మద్ రాథర్ నియంత్రణ రేఖ వెంబడి, పాకిస్తాన్ నుంచి వచ్చే ఆయుధాలు, మందుగుండు సామగ్రిని భారత్ లోకి చేరవేయడంలో కీలక పాత్ర పోషించాడని పోలీసులు తెలిపారు. లష్కరే తోయిబా ఉగ్రవాదులైన ఖుర్షీద్ అహ్మద్ రాథర్, గులాం సర్వార్ రాథర్ లతో కలిసి పాకిస్తాన్ నుంచి వచ్చే ఆయుధాలు, మందుగుండు సామగ్రిని నియంత్రణ రేఖ ద్వారా భారత్ లోకి రియాజ్ అహ్మద్ రాథర్ తీసుకువచ్చేవాడని వెల్లడించారు.