నటుడు నిఖిల్ సిద్ధార్థ త్వరలో తండ్రి కాబోతున్నాడు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించాడు. 2020లో తాను ప్రేమించిన డాక్టర్ పల్లవి వర్మ మెడలో మూడుముళ్లు వేసిన నిఖిల్ తాజాగా ఆమె సీమంతం ఫొటోను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. త్వరలోనే తాము తల్లిదండ్రులం కాబోతున్నామని, ఈ విషయం మీతో పంచుకుంటున్నందుకు ఆనందంగా ఉందని, మీ ఆశీస్సులు కావాలని కోరాడు. ప్రస్తుతం భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో ‘స్వయంభూ’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా కోసం వియత్నాం వెళ్లి మూడు నెలలపాటు యుద్ధ విద్యలు కూడా నేర్చుకున్నాడు. నిఖిల్ కెరియర్‌లోనే ఇది భారీ బడ్జెట్ సినిమాగా రూపొందుతోంది.