కూనవరం:గర్భిణీలు, బాలింతలు తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవాలని ఐసిడిఎస్ సిడిపిఓ నాగలక్ష్మి సూచించారు. కూనవరం మండలం టేకులబోరు రెండో అంగన్వాడి కేంద్రంలో శుక్రవారం పోషక బట్వాడా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ నెల 9 నుంచి 23 వరకు జరిగే ఈ కార్యక్రమం వల్ల పోషకాహారం పై కల్పిస్తున్నామని ఆమె చెప్పారు.చిరుధాన్యాలు, ఆకుకూరలు, అంగన్వాడీ కేంద్రంలో లబ్ధిదారులకి అందించిన పోషకాహారాన్ని వినియోగించుకోవాలని, పోషక విలువలు కలిగిన ఆహారoను తీసుకోవాలని ఆమె చెప్పారు. గర్భిణీ నుంచి వెయ్యి రోజుల వరకు ఏ ఆహారాన్ని తీసుకోవాలో సిడిపిఓ నాగ లక్ష్మి అవగాహన కల్పించారు. అనంతరం అంగన్వాడి కేంద్రం నుంచి సెంటర్ వరకు ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ వనజాక్షి, ఉపాధ్యాయురాలు ధనలక్ష్మి,అంగన్వాడి సిబ్బంది,వైద్య సిబ్బంది, ఆశ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.