చేజారిన అధికారాన్ని చేజిక్కించుకుని యనమల దివ్య తన తండ్రికి గిఫ్ట్ అందించగలరా?
సిట్టింగ్ ఎమ్మెల్యే మంత్రి దాడిశెట్టి రాజాకు హ్యాట్రిక్ సాధ్యమేనా?
రంజుగా మారిన తుని రాజకీయం
పారుపల్లి నవీన్ పొలిటికల్ రిపోర్ట్
తుని
తెలుగుదేశం పార్టీ లో రాజకీయ ఉద్దండడు యనమల రామకృష్ణుడు. తెలుగుదేశం పార్టీలోఅంచెంచలుగా ఎదిగిన ఈయన ఆ పార్టీకి వ్యూహకర్తే. న్యాయవాది వృత్తి తో ఉన్న యనమల రామకృష్ణుడు ఎన్టీఆర్ పిలుపును అందుకుని 1982లో తెలుగుదేశం పార్టీలో సభ్యత్వం పొందారు. 1993లో తుని నుంచి పోటీ చేసిన యనమల తొలి ప్రయత్నం లోనే అసెంబ్లీ గడపెక్కడమే కాదూ ఎకాఎకినా ఎన్టీఆర్ క్యాబినెట్లో చోటు దక్కించుకున్నారు. అప్పటినుంచి తెలుగుదేశం పార్టీలో యనమల తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడమే కాకుండా టిడిపిలో నెంబర్ టుగా పార్టీ సిద్ధాంతకర్తగా పేరుందారు. 1983, 85, 89, 94, 99, 2004, వరుసగా ఎన్నికై తునిలో డబల్ హ్యాట్రిక్ సాధించిన యోధుడు ధీరుడు.యాంకర్ 2. ఇలా డబల్ హ్యాట్రిక్ సాధించి ఓటమి ఎరుగని యోధుడిగా పేరొందిన యనమలకు 2009 ఎన్నికలు షాకిచ్చాయి. ఆ ఎన్నికల్లో ఓటమిని మూటగట్టుకున్న రామకృష్ణుడు అప్పటినుంచి ప్రత్యక్ష రాజకీయాలకు దూరమయ్యారు. అయినా ఆయనకు అధికారులు మాత్రం కొదవే లేదు. శాసనమండలికి ఎన్నికై ప్రతిపక్షనేతగా ఇప్పటికీ క్యాబినెట్ హోదాలోనే కొనసాగుతున్నారు.యనమల రామకృష్ణుడి రాజకీయ ప్రస్థానమంతా క్యాబినెట్ హోదా తోనే ముడిపడింది. 1983లో ఎన్టీఆర్ క్యాబినెట్లో పని చేసిన ఆయన 1989లో పబ్లిక్ అండర్ టేకింగ్ చైర్మన్ గాను పబ్లిక్ అకౌంట్స్ చైర్మన్ గాను వ్యవహరించి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కూడా క్యాబినెట్ హోదాను అనుభవించారు. 1994లో శాసనసభ స్పీకర్ గా వ్యవహరించిన ఆయన ఆ తర్వాత చంద్రబాబు క్యాబినెట్లో ఆర్థిక మంత్రిగా వ్యవహరించారు. రాష్ట్ర రాజకీయాల్లో బిజీ అయిన యనమల నియోజవర్గ బాధ్యతలను సోదరుడు యనమల కృష్ణుడికి అప్పగించారు. పార్టీకి వెన్నుదన్నుగా నిలిచిన కృష్ణుడు అన్నీ తానే పార్టీ క్యాడర్ కు నేనున్నానని నియోజవర్గానికి పెద్దదిక్కుగా నిలిచారు. ఈయన సేవలను గుర్తించిన తెలుగుదేశం పార్టీ 2014, 2019 ఎన్నికల్లో అభ్యర్థిగా నిలిపింది. అయితే వైసిపి గాలిలో కృష్ణుడుకు వరస ఓటములు ఎదురయ్యాయి. అయినా ఏమాత్రం నిరుత్సాహ పడకుండా పార్టీని ఒంటి చేత్తో నడిపించి తెలుగుదేశం పార్టీకి బలమైన క్యాడర్ ను నిర్మించారు. 2014 తుని రాజకీయ ముఖచిత్రం మారిపోయింది. ఆ ఎన్నికల్లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన దాడిశెట్టి రాజా వరసగా రెండు పర్యాయాలు గెలుపొంది యనమల కుటుంబానికి చెక్ పెట్టారు. మరి ఈసారి ఏమవుతుందీ. 2009 వరకు తుని యనమలకు ఓట్ల గనిగా నిలిచింది. యనమలకు అడ్డగా నిలిచిన తుని నియోజకవర్గంలో 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి రాజా అశోక్ బాబు చెక్ పెడితే… ఆ తర్వాత పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన దాడిశెట్టి రాజా… యనమల కుటుంబ హవాకు బ్రేక్ వేశారు. ప్రజారాజ్యం ఆవిర్భావంతో రాజకీయ ఆరంగేట్రం చేసిన దాడిశెట్టి రాజా ఆ తర్వాత వైసీపీలో చేరి తన పొలిటికల్ కెరియర్ ను ప్రజలు వచ్చి ఉన్నారు. 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన రాజా ఆ రెండు పర్యాయాలు అప్రహిత విజయాలను అందిపుచ్చుకున్నారు. జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో మంత్రి అయ్యారు. అంగ బలం అర్థ బలం మెండుగా ఉన్న దాడిశెట్టి రాజా… యనమలకు ఛాలెంజ్ విసిరే స్థాయికి ఎదిగారు. తెలుగుదేశం పార్టీకి ఏకు మేకయ్యారు. బలమైన క్యాడర్ ను ఏర్పరచుకుని మరో ఎన్నికల సం గ్రామానికి సై అంటున్నారు . .
సరైన సమయానికి సరైన నాయికీ
తెలుగుదేశం పార్టీ చేజారిన అధికారాన్ని హస్తగతం చేసుకునేందుకు యనమల తనయురాలు యనమల దివ్యను సైకిల్ ఎక్కించారు. పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిపింది. సరైన సమయానికి సరైన నాయికీ యనమల దివ్య కు పట్టం కట్టేందుకు ఇటు తమ్ముళ్ళు అటు జన సైనికులు అస్త్ర శస్త్రాలు సిద్దం చేసారు.జననేత్రి యనమల దివ్య జండా అజెండా చేతబట్టారు. నియోజవర్గంలో తెలుగుదేశం పార్టీకి పునర్వైభం తెస్తానని శఫధం చేసిన దివ్య ఈ ఎన్నికల్లో గెలిచి తన తండ్రికి గిఫ్ట్ అందిస్తానని అంటున్నారు. ఏడాది క్రితమే నియోజవర్గ ఇన్చార్జి పగ్గాలు చేబట్టిన యువనేత్రి యనమల దివ్య మీ ఇంటికి మీ దివ్య కార్యక్రమంలో ప్రచార భేరి మోగించారు. బాబు ష్యూరిటి భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని ఊరు రా నిర్వహించి తెలుగుదేశం పార్టీ సూపర్ సిక్స్ పథకాలతో ప్రజల ముందుకు వెళ్తున్నారు. యనమల దివ్య కు ప్రజాభిమానం పెల్లుబిక్కుతుంది. ప్రజాదరణ మెండుగా కనిపిస్తుంది. ప్రజా నేతగా పేరొందారు. హ్యాట్రిక్ కు మంత్రి దాడిశెట్టి రాజా తహతహలాడుతుండగా… వైసీపీకి చెక్ పెట్టి అప్పుడు ఇప్పుడు మరి ఎప్పుడైనా తుని యనమల అడ్డేనని రుజువు చేసేందుకు తమ్ముళ్లు జన సైనికులు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఇప్పటికే ప్రచార పర్వంలో దూసుకుపోతున్న యనమల దివ్య గ్రాఫ్ బాగా పెరిగింది. బాబాయ్ యనమల కృష్ణుడు ఛక్రం చెపుతున్నారు. 30 వేల మెజార్టీ టార్గెట్ చేసిన కృష్ణుడు ఆ దిశగా పార్టీ యంత్రాంగాన్ని సర్వసన్నద్దం చేస్తున్నారు. మరోవైపు పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు తన బిడ్డ విజయానికి పూల బాట పరుస్తున్నారు. స్వగ్రహ ప్రవేశాలకు ద్వారాలు తెరిచారు. ఆల్ డోర్స్ ఓపెన్ .. యనమల పిలుపు అందుకుంటున్న నాయక గణం సైకిల్ ఎక్కేందుకు క్యూ కడుతున్నారు. ఇప్పటికే తెలుగుదేశం లోకి వలసలు జోరందుకున్నాయి. జన సైనికులు బలం పెరగడంతో ఆ ఓట్ల బ్యాంకు యనమల దివ్య కు బాగా కలిసేలా కనిపిస్తుంది. అదేవిధంగా నియోజకవర్గంలో రాజకీయ దిగ్గజ కుటుంబాలు యనమల వెంట అడుగులు వేస్తున్నారు. రాజ కుటుంబీకులు అంతా ఒకటే యనమల దివ్య గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఇక మంత్రి దాడిశెట్టి రాజా హ్యాట్రిక్ సాధిస్తానని ఘంటాపధంగా చెప్తున్నారు.