ఉప్పల్ స్టేడియంలో ఇండియా, ఇంగ్లాండ్ జట్టుల మధ్య ఈ రోజు తొలి టెస్టు ప్రారంభమైంది. తొలి రోజే ఈ టెస్టు మ్యాచ్‌లో రికార్డులు బద్ధలయ్యాయి. ఉభయ జట్ల ఆటగాళ్ల పలు రికార్డులను సమం చేశారు. ఇండియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన టెస్టు సిరీస్‌లలో అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్‌మెన్‌గా జో రూట్ నిలిచారు. ఇంతకు ముందు సచిన్ టెండుల్కర్ పేరిట ఈ రికార్డు ఉన్నది. ఇండియాపై 9 శతకాలు, 10 అర్ధ శతకాలు సాధించాడు. మొత్తం ఇండియాపై 2,555 పరుగులు చేశాడు. టెస్టుల్లో భారత్ పై అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్‌మెన్‌గా ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రిక్కీ పాంటింగ్ రికార్డును జో రూట్ తాజాగా సమం చేశాడు.
టెస్టు మ్యాచ్‌లో తొలి రోజే ప్రత్యర్థి టీమ్‌ను ఆలౌట్ చేసి మరో టీమ్ బ్యాటింగ్ చేసిన సందర్భంలో అత్యధిక పరుగులు సాధించిన ఇండియా బ్యాట్స్‌మెన్‌లలో యశస్వీ జైస్వాల్ మెరిశాడు. 2005లో జింబాబ్వే టీమ్ పై గౌతం గంభీర్ 95 పరుగులు చేశాడు. ఆ తర్వాత అత్యధిక పరుగులు (76 పరుగులు) సాధించిన బ్యాట్స్‌మెన్ యశస్వీ జైస్వాల్. 2016లో వెస్ట్ ఇండీస్ పై కేఎల్ రాహుల్ 75 పరులు చేశాడు.