డాక్టర్: రేష్మా
ప్రజాభూమి,తొండూరు
తొండూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశా డే సందర్భంగా వైద్యాధికారి డాక్టర్ రేష్మా ఆధ్వర్యంలో మలేరియా,డెంగ్యూ వ్యాధుల అవగాహనా కొరకు ర్యాలీ మంగళవారం నిర్వహించారు.ఈ కార్యక్రమ ములో సబ్-యూనిట్ అధికారి సిద్దయ్య ల్యాబ్ రే టరీ పరిశీలించి మలేరియా కేసులు ఏమైనా నమోదు అయినాయ అని ల్యాబ్ టెక్నీషియన్ కుమారి ని అడిగితెలుసుకున్నారు. ఆశా మీటింగ్ లో ఆయనమాట్లడుతూ ప్రస్తుతం వర్షాలు పడుతున్నాయి కావున నీరు నిల్వలు ఉండుట వలన దోమలు వృద్ధి చెందే అవకాశం ఉన్నది, కాబట్టి జాగ్రత్తలు పాటించాలని దోమ కాటు వలన మలేరియా, డెంగ్యూ, చికున్ గున్యా, మెదడువాపు వ్యాధి, పైలేరియాసిస్ వ్యాధులు వ్యాప్తి చెందుతా యి కాబట్టి దోమలు పుట్టకుండా కుట్టకుండా చూసుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి పై ఉన్నది అని, నివారణ చర్యలు: నీరు నిల్వ ఉంచిన తొట్లు, మరియు ఇతర పాత్రలు మూతలు మూసి ఉంచా లి, నీటి కుళాయిలు వద్ద నీరు నిల్వ ఉండ కుండా చుడాలి. శరీరాన్ని పూర్తిగా కప్పిఉంచే దుస్తులను ధరించాలి. మురుగునీరు చేరకుండా చూసుకోవా లి. దోమతెరలు తప్పని సరిగా వాడాలి, ప్రతి శుక్రవారం డ్రై డే పాటించాలి అని ప్రజలకు ఆరోగ్య కార్యకర్తలు ఆశా కార్యకర్తలు అవగాన కల్పిచాలని సిద్దయ్య తెలిపారు.ఈ కార్యక్రమము లో హెల్త్ ఎడ్యుకేటర్ మల్లయ్య ,సూపర్ వైజర్ శశి కళ , ఆరోగ్య కార్యల ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.