చంద్రగిరి నియోజకవర్గ అభివృద్ధికి సహకరించండి…!
టిడిపి యువనేత “పులివర్తి వినీల్”
రామచంద్రపురం
నీతి, నిజాయితీ, నిబద్ధత గల తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టాలని చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ అధ్యక్షుడు, చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని తనయుడు పులివర్తి వినీల్ అన్నారు. పులివర్తి నానితోనే అవినీతి రహిత పాలన సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. ‘మీ ఇంటి వద్దకు మీ పులివర్తి నాని ” “బాబు ఘారిటి భవిష్యత్తుకు గ్యారెంటీ ” కార్యక్రమంలో భాగంగా భాగంగా ఆయన రామచంద్రాపురం మండలం, అనుపల్లి పంచాయితీలో పర్యటించారు. ఈ సందర్భంగా మండల నాయకులు వినీల్ కు ఘన స్వాగతం పలికారు. ఇంటింటికి తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
అభివృద్ధిలో 30 ఏళ్లు వెనుకపడిన చంద్రగిరిని గాడిలో పెట్టాలంటే ఎలాంటి అవినీతి ఆరోపణలు లేని "పులివర్తి నాని"కి ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు పులివర్తి వినీల్.... ఓటమి భయంతో దొడ్డి దారిలో అందలం ఎక్కాలని ఎమ్మెల్యే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా 30వేలకు పైగా బోగస్, దొంగ ఓట్లు నమోదయ్యాయని పోరాటం చేస్తున్నా అధికారులు స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
మహానాడు వేదికగా మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన మినీ మేనిఫెస్టోకు అద్భుతమైన ఆదరణ లభిస్తోందని పులివర్తి వినీల్ పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రకటించిన మినీ మేనిఫెస్టో ద్వారా ఒక్కో కుటుంబానికి ఏటా రూ.1.22 లక్షలు ఆర్థికసాయం అందుతుందని ఆయన స్పష్టం చేశారు. అంతేకాదు అదనంగా 3 గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కలుగుతుందని చెప్పారు. రాష్ట్ర సంపద పెంచాలన్న, పేదలకు పంచాలన్నా తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.